‘మా కుటుంబంలో అందర్నీ కోల్పోయాం’ గాజా సిటీలో ఓ కుటుంబ పెద్ద ఆవేదన, ఇజ్రాయెల్ బాంబుల వర్షంలో ఆల్-జజీరా కార్యాలయం ధ్వంసం

గాజాసిటీపై ఇజ్రాయెల్ దాడులను పెంచింది. ఇక్కడి అంతర్జాతీయ మీడియా కార్యాలయాలపై శనివారం వైమానిక దాడులు జరిపించింది. అల్-జజీరా టీవీ వంటి పలు మీడియా ఆఫీసులు ఈ దాడుల్లో దెబ్బ తిన్నాయి.

  • Publish Date - 9:21 pm, Sat, 15 May 21 Edited By: Phani CH
'మా కుటుంబంలో అందర్నీ కోల్పోయాం' గాజా సిటీలో ఓ కుటుంబ పెద్ద ఆవేదన, ఇజ్రాయెల్ బాంబుల వర్షంలో ఆల్-జజీరా కార్యాలయం ధ్వంసం
Israel Strikes Gaza Buildin

గాజాసిటీపై ఇజ్రాయెల్ దాడులను పెంచింది. ఇక్కడి అంతర్జాతీయ మీడియా కార్యాలయాలపై శనివారం వైమానిక దాడులు జరిపించింది. అల్-జజీరా టీవీ వంటి పలు మీడియా ఆఫీసులు ఈ దాడుల్లో దెబ్బ తిన్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ సహా ఇంకా స్థానిక కార్యాలయాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. జలాల్ టవర్ అనే 13 అంతస్థుల ఈ భవన యజమాని జవాన్ మెహదీని ఇజ్రాయెల్ అధికారులు ఓ గంట ముందుగా హెచ్చరించి వీటిలోని సిబ్బందిని ఖాళీ చేయాల్సిందిగా కోరారట.లేని పక్షంలో బాంబుల వర్షం కురిపిస్తామని గట్టి వార్నింగ్ ఇఛ్చారట. ఇక్కడి ఓ శరణార్థి శిబిరంపై జరిగిన బాంబు దాడిలో 10 మంది సభ్యులున్న కుటుంబమంతా హతులు కాగా కుటుంబ పెద్ద ఒకరు, 5 నెలల ఓ శిశువు మాత్రం బతికి బయట పడ్డారు. అమాయకులైన తాము ఏం చేశామని ఆ కుటుంబ పెద్ద ఆవేదనగా చెప్పాడు. తాము సాధారణ పౌరులమని, ఈ పోరాటం గురించి తమకేమీ తెలియదని ఆయన అన్నాడు. అయితే హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ కు చెందిన అధికారులు ఈ శిబిరాన్ని వినియోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

హమాస్ వర్గం ఇజ్రాయెల్ పైకి 2 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో 10 మంది ఇజ్రాయెలీలు మరణించారు. కాగా- ఆరు రోజులుగా సాగుతున్న ఈ పోరులో 39 మంది పిల్లలతో సహా 139 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. వెయ్యిమెండికి పైగా గాయపడ్డారు. ఇప్పట్లో తాము గాజా సిటీపై దాడులను ఆపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్ళీ హెచ్చరించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ananya Nagalla: సోషల్ మీడియలో విపరీతంగా ఫాలోయింగ్‌ పెంచుకుంటున్న వకీల్ సాబ్‌ ఫేమ్ అనన్య.. ( వీడియో )

Nandamuri Balakrishna : బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?