Nandamuri Balakrishna : బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ ను వెండి తెరపై..

Nandamuri Balakrishna : బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?
Balakrishna
Follow us

|

Updated on: May 15, 2021 | 9:31 PM

Nandamuri Balakrishna : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ ను వెండి తెరపై వకీల్ సాబ్ గా కనిపించరు. పవన్ జోష్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో అదరగొట్టారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దాగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ‘పింక్’ తెలుగు రీమేక్ లో హీరోగా ముందు అనుకున్నది పవన్ కళ్యాణ్ ని కాదు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు ‘పింక్’ సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నప్పుడు, ముందుగా బాలకృష్ణను కలిశారట. కథ విన్న బాలకృష్ణ అంతగా ఆసక్తిని చూపలేదట.

ఆ తరువాత మాటల సందర్భంలో ఈ కథను గురించి త్రివిక్రమ్ దగ్గర దిల్ రాజు ప్రస్తావించారట. అప్పటికే రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న పవన్ కు దాన్ని చూపించడం.. పవర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు. దాంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియదు. కానీ ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Puri Jagannadh : పూరీ చెప్పిన మంచిమాట.. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి…కానీ

Director S. Shankar: తిరిగి పట్టాలెక్కనున్న ఇండియన్ 2 మూవీ.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితేంటి…

బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..