Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..

సిల్వర్‌ స్క్రీన్ పై ఆయనో లయన్‌.. కాని షూట్‌ ప్లేస్‌లో ఆయనో జాయ్‌ ఫుల్ పర్సన్‌.. ఇంతకీ ఆయన ఎవరని అనకుంటున్నారా..

బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..
Balayya Pragya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 15, 2021 | 8:14 PM

 pragya jaiswal: సిల్వర్‌ స్క్రీన్ పై ఆయనో లయన్‌.. కాని షూట్‌ ప్లేస్‌లో ఆయనో జాయ్‌ ఫుల్ పర్సన్‌.. ఇంతకీ ఆయన ఎవరని అనకుంటున్నారా.. ఇంకెవరు మన బాలకృష్ణ. అవును.. ఎప్పుడూ ఆఫ్‌ స్క్రీన్‌లో సరదాగా.. అల్లరి చేస్తూ.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే బాలయ్యను చూసి చాలా మంది భపడుతుంటారు. కాని వన్స్‌ ఈ హీరోతో ట్రావెల్‌ చేస్తే.. మాత్రం “మరీ ఇంత కూలా..” అని షాకవుతుంటారు. ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్‌నే ఎక్స్‌ప్రెస్‌ చేశారు.. హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. బాలయ్య హీరోగా బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కతున్న సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఆ షూట్‌లోని విషేశాలను రీసెంట్గ్‌గా ప్రగ్యా ఓ ఇంటర్యూలో పంచుకున్నారు.”బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలనే సరికి కొంచెం భయమేసింది. ఎందుకంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ. సెట్లో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో కొంత భయపడ్డాను. కానీ, బాలకృష్ణ సెట్లోకి అడుగుపెట్టగానే అందరితో సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. ఇక భయం లేదనిపించింది.” అని ప్రగ్యా.. చెప్పారు అంతే కాదు తిరిగి సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వెయిట్ చేస్తున్నాఅన్నారు.

ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీత అందిస్తున్నారు. శ్రీకాంత్‌, పూర్ణలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన అఖండ టీజర్‌ అందర్నీ ఆకట్టుకుంటూ సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేసింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shilpa Shetty: మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమాలో సాగరకన్య.. కీలక పాత్రకోసం బాలీవుడ్ భామ..

Gautam Raju: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన సోదరుడు చనిపోయాడన్న నటుడు గౌతమ్ రాజు..

Mega Prince Varun Tej : వరుణ్ తేజ్ సినిమాకూడా వెనక్కు వెళ్లనుందా.. ‘గని’ సినిమాను వాయిదా వేయనున్నారా..?