Guinness World Records: ప్రపంచంలో ‘స్ట్రాంగెస్ట్’ తిండితో గిన్నిస్ రికార్డు..ఇంతకీ ఇతని ఆహారం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు!
Guinness World Records: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరు చెబితేనే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఇందులో పేరు నమోదు కోసం ఎందరెందరో ఎన్నో రకాల సాహసాలు చేస్తుంటారు.
Guinness World Records: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేరు చెబితేనే ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఇందులో పేరు నమోదు కోసం ఎందరెందరో ఎన్నో రకాల సాహసాలు చేస్తుంటారు. వింత వింత రికార్డులను నెలకొల్పడానికి నిత్యం ప్రపంచవ్యాప్తంగా వందలాదిమంది తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిగో ఇక్కడో వ్యక్తి అటువంటి వింత ప్రయత్నం ఏదీ చేయకుండానే రికార్డు కొట్టేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన ఘనకార్యం ఏమిటో.. ఆ రికార్డు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. మేన్సియూర్ మ్యాన్ గౌట్ అని పిలుచుకునే మైఖేల్ లోటిటో అనే ఫ్రెంచ్ కుర్రోడు తిండిలో రికార్డు కొట్టేశాడు. అంటే అన్నం కూరలు వంటివి కాదు సుమండీ.. లోహం, గాజు పదార్థాలను అప్పడాల్లా నమిలేస్తాడు ఇతగాడు. తన 9 ఏళ్ల వయసునుంచే ఇలా లోహాలను, గాజు ముక్కలను పరపరా నమిలి పారేస్తున్నాడు ఇతను. రోజుకు 900 గ్రాముల లోహాన్ని తినేసేవాడు.
ఇంతకీ ఇలా ఎందుకు తింటాడంటే.. డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా? మనోడికి పికా అనే మానసిక రుగ్మత ఫలితంగా ఇలా లోహపు ముక్కలు గట్రా తినేస్తాడట. ఇక ఇతను బ్రతకాలి కదా. అందుకు ఇదే వృత్తిగా ఎంచుకున్నాడు. స్టేజి మీద కూచుని లోహపు పలకలు.. గాజు ముక్కల్నీ నమిలేసి జనంతో ఔరా అనిపించుకుని ఆపై డబ్బూ పుచ్చుకుని బ్రతికేవాడు. అలా మనోడు తినేసిన తిండి లెక్కల్లో 966 నుండి, 18 సైకిళ్ళు, 15 సూపర్ మార్కెట్ ట్రాలీలు, ఏడు టీవీ సెట్లు, ఆరు షాన్డిలియర్లు, రెండు పడకలు, ఒక జత స్కిస్, తక్కువ కేలరీల సెస్నా లైట్ ఎయిర్క్రాఫ్ట్, ఒక కంప్యూటర్ ఉన్నాయి.
ఇంతకీ మనోడికి ఈ వింత తిండి అలవాటున్నట్టు ఎలా తెలిసిందో తెలుసా? ఒకసారి ఎదో జ్యూస్ తాగుతున్నాడట. అప్పుడు గాజు గ్లాసు పగిలిపోయింది. అందులో ఓ ముక్క బాబు నోట్లోకి వెళ్ళిపోయింది. అది అలానే నమిలేశాడు. మహా టేస్టీగా అనిపించిందట.. ఇక అప్పటి నుంచీ ఇలా అన్నీ తినేయడం మొదలు పెట్టాడు. గిన్నిస్ వరల్డ్ వెబ్ సైట్ లెక్కల ప్రకారం అక్టోబర్ 1997 నాటికి, అతను దాదాపు తొమ్మిది టన్నుల లోహాన్ని తిన్నాడు. అరటిపండ్లు, గట్టిగా ఉడికించిన గుడ్లు తనను అనారోగ్యానికి గురి చేశాయని ఆయన చెప్పాడు. ఇలా అరుదైన రికార్డు సృష్టించిన లోటిటో జూన్ 25, 2007 న సహజ కారణాలతో మరణించినట్టు గిన్నిస్ బుక్ పేర్కొంది.
Also Read: ONLINE TERRORISM: వేళ్ళూనుకుంటున్న ఆన్‌లైన్ టెర్రరిజమ్.. టెక్కీల సాయంతో అంతానికి అగ్రరాజ్యం స్కెచ్
లక్కు కాలింగ్ బెల్ కొట్టినా, తొక్కలో దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడింది!