TG Police SI Training: హోంశాఖకు మరో 547 మంది ఎస్సైలు.. ఈనెల 11న పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్సైలు చేరనున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్‌ పోలీస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. వీరంతా తాజాగా రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు..

TG Police SI Training: హోంశాఖకు మరో 547 మంది ఎస్సైలు.. ఈనెల 11న పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌
Police SI Training
Follow us

|

Updated on: Sep 02, 2024 | 2:40 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2: తెలంగాణ హోంశాఖలో త్వరలో కొత్తగా మరో 547 మంది ఎస్సైలు చేరనున్నారు. సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్‌ పోలీస్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. వీరంతా తాజాగా రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 11వ తేదీన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (పీవోపీ) నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిష్త్‌ ప్రకటన వెలువరించారు. పీపాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవనున్నారు. ఈ మేరకు అకాడమీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ ఇన్‌స్పైర్‌ పోటీలకు విద్యార్ధుల స్పందన కరువు.. ఈ నెల 15తో ముగుస్తున్న దరఖాస్తులు

తెలంగాణలో ప్రతిష్ఠాత్మక ఇన్‌స్పైర్‌ పోటీలకు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఉన్నత పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించినా.. స్పందన కరువయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు కలిపి మొత్తం 12,954 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఒక్కో చోట నుంచి గరిష్ఠంగా అయిదు దరఖాస్తుల వరకు పంపించే అవకాశం ఉంది. ఈ పోటీల్లో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. దరఖాస్తుకు గడువు సెప్టెంబరు 15వ తేదీతో ముగియనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 8,814 దరఖాస్తులు మాత్రమే అందడం గమనార్హం. 11 జిల్లాల్లో దరఖాస్తుల సంఖ్య రెండంకెలు కూడా దాటకపోవడంతో అధికారులు పెదవి విరుస్తున్నారు. కాగా ప్రతీయేట ఇన్‌స్పైర్‌ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మాత్రం ఈ పోటీలకు విద్యార్ధులు సుముఖత చూపడం ఆందోళన కలిగిస్తుంది.

కేయూ పరిధిలో నేటి పరీక్షలన్నీ వాయిదా.. రేపట్నుంచి యథాతథం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశాల మేరకు.. కేయూ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఈ రోజు (సెప్టెంబరు 2) జరగవల్సిన పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య మల్లారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధిలో సెప్టెంబరు 2న జరగాల్సిన థియరీ, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్, వైవా వంటి అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని, మంగళవారం నుంచి జరిగే మిగతా పరీక్షలు అన్నీ యథావిధిగా జరుగుతాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.