AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సటీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

ANGRAU: ఆచార్య ఎన్‌జీ రంగా వర్సటీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక
Angrau Jobs
Narender Vaitla
|

Updated on: May 05, 2023 | 7:01 PM

Share

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 ఖాళీలు ఉన్నాయి.

* వీటిలో ఫీల్డ్ సూపర్‌వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టిషియన్, కంప్యూటర్ స్టాఫ్‌, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బ‌ట్టి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ-మెయిల్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* మొదట అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అప్లికేషన్‌ను ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను andhrapradeshcss@gmail.com మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు మే 10వ తేదీని చివరి తేదీగా నిర్వహించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..