AP Tenth Results: ఏపీ టెన్త్ రిజల్ట్స్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది…
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. ఏపీలో ఏప్రిల్ 18వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు స్పాట్ వాల్యుయేషన్ జరిగింది. తాజాగా రిజల్ట్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.
ఆంధ్రాలో 10వ తరగతి పరీక్షా ఫలితాల తేదీపై నెట్టింట అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. శుక్రవారమే రిజల్ట్స్ అని చాలామంది మెసేజ్‌లు ఫార్వార్డ్ చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. 2023 మే 6వ తేదీ(శనివారం) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తయిందని వెల్లడించారు. మే 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పరీక్షల స్పాట్ మూల్యాంకనం జరిగిందని దయానందరెడ్డి వివరించారు. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు.
మూల్యాంకనం అనంతరం మే 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. టీవీ9 వెబ్ సైట్ సందర్శించి కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..