AP TET 2024 Exam Dates: రేపట్నుంచి టెట్‌ (జులై) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షలు ఎప్పటినుంచంటే!

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై నోటిఫికేషన్‌ సోమవారం (జులై 1) విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 2 పేపర్లకు టెట్‌ పరీక్ష జరుగుతుంది. పేపర్‌ 1 ఏ పరీక్ష ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌ 1 బీ పరీక్ష స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. అలాగే పేపర్‌ 2 ఏ పరీక్ష స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌ 2 బీ పరీక్ష స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు..

AP TET 2024 Exam Dates: రేపట్నుంచి టెట్‌ (జులై) ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్షలు ఎప్పటినుంచంటే!
AP TET 2024 Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 02, 2024 | 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై నోటిఫికేషన్‌ సోమవారం (జులై 1) విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 2 పేపర్లకు టెట్‌ పరీక్ష జరుగుతుంది. పేపర్‌ 1 ఏ పరీక్ష ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌ 1 బీ పరీక్ష స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. అలాగే పేపర్‌ 2 ఏ పరీక్ష స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌ 2 బీ పరీక్ష స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. డీఎడ్, బీఎడ్‌లో అర్హత కలిగిన అభ్యర్ధులకు టెట్‌ రాసేందుకు అర్హత ఉంటుంది. పేపర్‌ 2 ఏ రాసే ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మిగతావారు 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. సిలబస్, పరీక్ష విధానానికి సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన వారు జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.750 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. టెట్‌ దరఖాస్తు రుసుమును జులై 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు జులై 16 నుంచి అందుబాటులో ఉంటాయి. జులై 25 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. రోజుకు రెండు సెఫన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల అనంతరం ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ని ఆగస్టు 10న విడుదల చేస్తారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు అభ్యంతరాలను స్వీకరించి, తుది కీని ఆగస్టు 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్‌ ఫలితాలు ప్రకటించేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు.

డీఎస్సీలో టెట్‌ పరీక్ష మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఓసీ అభ్యర్ధులు 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్ధులు 50 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ/వికాలాంగ/ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు 40 శాతం మార్కులు వస్తేనే టెట్‌లో అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు కాబట్టి మార్కుల కేటాయింపులో నార్మలైజేషన్‌ అమలు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?