AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Prelims Result 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2024 ఫలితాలు.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సోమవారం (జులై 1) విడుదలైన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా యూపీఎస్సీ ప్రకటించింది. జూన్ 16న ఈ రెండు పరీక్షలు దేశ వ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు..

UPSC Prelims Result 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2024 ఫలితాలు.. మెయిన్స్‌కు ఎంత మంది క్వాలిఫై అయ్యారంటే!
UPSC Prelims Result 2024
Srilakshmi C
|

Updated on: Jul 02, 2024 | 3:40 PM

Share

న్యూఢిల్లీ, జులై 2: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సోమవారం (జులై 1) విడుదలైన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా యూపీఎస్సీ ప్రకటించింది. జూన్ 16న ఈ రెండు పరీక్షలు దేశ వ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రిలిమ్స్‌ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 14,627 మంది ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు. మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్‌ నంబర్లతో కూడిని జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. తెలుగు రాష్ట్రాల నుంచి 500లకు పైగా అభ్యర్ధులు మెయిన్స్‌కు ఎంపికైనట్లు సమాచారం. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీలను మరో రెండు, మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌ తెలిపింది.

గత ఏడాది మే 26న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించి జూన్‌ 12న ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితంగా జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి, జులై 1న ఫలితాలు వెల్లడించారు. యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ 2024 పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, పేపర్‌-2 లకు కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. పేపర్ 2లో అర్హత సాధిస్తేనే పేపర్‌ 1ను మూల్యాంకనం చేస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ రాయవల్సి ఉంటుంది. మెయిన్స్‌ రాతపరీక్ష తర్వాత పర్సనాలిటీ టెస్ట్‌ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 20 నుంచి జరగనున్నాయి.

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. జూన్‌లో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఈ పరీక్షలను నిర్వహించింది. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 15,058 మంది రాయగా, వారిలో 9,531 మంది (63.30శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా, వారిలో 18,842 మంది (69.07 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..