AP TET 2024 Hall Tickets: టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. సెప్టెంబర్‌ మూడో వారంలో హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 (జులై) పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం మొదటి సెషన్‌ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్‌ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు..

AP TET 2024 Hall Tickets: టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. సెప్టెంబర్‌ మూడో వారంలో హాల్ టికెట్లు విడుదల
AP TET 2024 Hall Tickets
Follow us

|

Updated on: Aug 25, 2024 | 6:41 AM

అమరావతి, ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 (జులై) పరీక్షలు సమీపిస్తున్నాయి. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం మొదటి సెషన్‌ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్‌ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లు సెప్టెంబర్‌ 22 తర్వాత అందుబాటులో రానున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత అంటు అక్టోబర్‌ 4 తర్వాత నుంచి ఆ ముందు రోజుల ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాల స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27వ తేదీ తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల అవుతుంది. నవంబర్‌ 2న టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు. క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు.. ఓసీ (జనరల్‌) కేటగిరీలో 60 శాతం ఆపైన‌ మార్కులు, బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన‌, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ కేటగిరీల వారికి 40 శాతం మార్కులు ఆపైన‌ వస్తేనే టెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ టెట్‌కు ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌కు పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు. ఈసారి మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో పోటీపడే వారి సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి టెట్‌ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకానుంది.

నిజానికి, ఈ ఏడాది జులై 2వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అలాగే పరీక్షల సన్నద్ధతకు కూడా మరింత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దాదాపు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ టెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

లంగావోణిలో జగతి మేడమ్ స్టన్నింగ్ లుక్స్..
లంగావోణిలో జగతి మేడమ్ స్టన్నింగ్ లుక్స్..
టీ20, వన్డేల్లో ఒక్క సిక్స్ కొట్టని ముగ్గురు భారత ఆటగాళ్లు..
టీ20, వన్డేల్లో ఒక్క సిక్స్ కొట్టని ముగ్గురు భారత ఆటగాళ్లు..
జైలులో దర్శన్‌కు రాజ భోగాలు!దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన హీరో
జైలులో దర్శన్‌కు రాజ భోగాలు!దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన హీరో
వాళ్లూ, వీల్లూ అని లేకుండా అందరికి ఇచ్చిపడేసిన చెర్రీ. ఎలాగంటారా?
వాళ్లూ, వీల్లూ అని లేకుండా అందరికి ఇచ్చిపడేసిన చెర్రీ. ఎలాగంటారా?
మద్దతు ధరకే పంటల కొనుగోలు.. ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
మద్దతు ధరకే పంటల కొనుగోలు.. ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
సౌత్ సినిమాలంటే గాల్లోకి మనుషులు, వాహనాలు ఎగరడమే..
సౌత్ సినిమాలంటే గాల్లోకి మనుషులు, వాహనాలు ఎగరడమే..
రోజు 2 అరటిపండ్లు తింటే చాలు ఎన్ని లాభాలు తెలుసా?
రోజు 2 అరటిపండ్లు తింటే చాలు ఎన్ని లాభాలు తెలుసా?
ఈ అమ్మకూచిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్
ఈ అమ్మకూచిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్
98 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు.. బ్యాటర్లకు అర్థంకాని పజిల్‌
98 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు.. బ్యాటర్లకు అర్థంకాని పజిల్‌
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్