AP Tenth Exam Fee last date: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. అక్టోబరు 28వ తేదీతో పరీక్ష ఫీజు గడువు ముగియడంతో తాజాగా నవంబరు 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. నవంబరు 10వ తేదీ వరకు ఎటువంటి అపరాద రుసుం లేకుండా చెల్లించవచ్చని ఆయన తెలిపారు. నవంబర్ 16వ తేదీలోపు అపరాధ రుసుం రూ.50తో, రూ.200తో నవంబర్ 22వ తేదీ
అమరావతి, అక్టోబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. అక్టోబరు 28వ తేదీతో పరీక్ష ఫీజు గడువు ముగియడంతో తాజాగా నవంబరు 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. నవంబరు 10వ తేదీ వరకు ఎటువంటి అపరాద రుసుం లేకుండా చెల్లించవచ్చని ఆయన తెలిపారు. నవంబర్ 16వ తేదీలోపు అపరాధ రుసుం రూ.50తో, రూ.200తో నవంబర్ 22వ తేదీలోపు, రూ.500తో నవంబర్ 30 వరకు పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించవచ్చని సూచించారు. విద్యార్థుల వివరాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు నవంబరు 10వ తేదీలోపు పంపాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు గడువు నవంబరు 14
2023-2024 విద్యాసంవత్సరానికి వచ్చ ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్, ఇర్రెగ్యులర్ విద్యార్థులు నవంబరు 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కమిషనర్ నవీన్‌మిత్తల్ షెడ్యూల్ విడుదల చేశారు. కాలేజీల పిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుంతో నవంబరు 16 – 23వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. రూ.500ల ఆలస్య రుసుముతో నవంబరు 25 – డిసెంబరు 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబరు 6 – 13 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో డిసెంబరు 15 – 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
ముగిసిన తెలంగాణ టీఆర్‌టీ దరఖాస్తు గడువు
తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)కి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,76,527 దరఖాస్తులు అందినట్లు విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తు గడువు శనివారం అర్ధరాత్రితో ముగియగా ఈ సందర్భంగా ఆయన వెల్లడించింది. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్‌జీటీ), పీఈటీ, భాషా పండితులు వంటి మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. వీటిల్లో ఎస్‌జీటీ తెలుగు పోస్టుల కోసం దాదాపు 60,190 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలు వచ్చే ఫిబ్రవరిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.