AP Polycet 2023 Results: రేపు విడుదలకానున్న ఏపీ పాలిసెట్-2023 ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
ఆంధప్రదేశ్ పాలిసెట్-2023 ఫలితాలు శనివారం (మే 20)న విడుదలవ్వనున్నాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా పాలీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి..
ఆంధప్రదేశ్ పాలిసెట్-2023 ఫలితాలు శనివారం (మే 20)న విడుదలవ్వనున్నాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా పాలీసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ ఏడాది మే 10న నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,43,625 మంది విద్యార్ధులు హాజరయ్యారు. అంటే 89.56 శాతం విద్యార్ధులు పరీక్ష రాశారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.