AP Mega DSC 2024 Update: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్‌ 30న మెగా డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు! ‘టెట్‌’ లేనట్టే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్‌ డీఎస్సీ ప్రకటనపై కీలక ప్రకటన వెలువరించింది. మెగా డీఎస్సీకి ముందే మరోసారి టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన సర్కార్‌.. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని..

AP Mega DSC 2024 Update: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్‌ 30న మెగా డీఎస్సీకి రెండు నోటిఫికేషన్లు! 'టెట్‌' లేనట్టే..
AP Mega DSC 2024
Follow us

|

Updated on: Jun 28, 2024 | 6:39 PM

అమరావతి, జూన్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్‌ డీఎస్సీ ప్రకటనపై కీలక ప్రకటన వెలువరించింది. మెగా డీఎస్సీకి ముందే మరోసారి టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన సర్కార్‌.. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. అందులో మొదటిది టెట్‌తో కూడిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కాగా, రెండోది ఇంతకు ముందే టెట్ పాసైన వారి కోసం నేరుగా మెగా డిఎస్సీకి మరో నోటిఫికేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ నెల 30న రెండు డీఎస్సీ నోటిఫికేషన్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుక సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను కూడా అదే రోజు వెల్లడించేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. నియామకాల ప్రక్రియను డిసెంబరు 10లోగా పూర్తి చేసి, జాయిన్ ఆర్డర్స్ కూడా అభ్యర్ధులకు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 80 శాతం పోస్టులు స్థానికులకి అవకాశం ఇచ్చేలా నోటిఫికేషన్‌ను రూపొందిస్తున్నారు. మిగిలిన 20 శాతం పోస్టులను నాన్ లోకల్ కింద భర్తీ చేసే అవకాశం ఉంది.

సీఎం చంద్రబాబు సారధ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మెగా డీఎస్సీకి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్హులైన అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి వీలుగా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మళ్లీ టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పిన సర్కార్ ఉన్నట్లుండి.. టెట్ కమ్ డీఎస్సీ అని యూటర్న్ తీసుకోవడంతో అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. మెగా డీఎస్సీకి ముందే టెట్ పరీక్ష నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి విడిగా.. కొత్తగా అర్హత సాధించవల్సిన వారికి మరొకటిగా రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువరిస్తామంటోన్న విద్యాశాఖ నిర్ణయం చర్చణీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్త కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
పరిమితి పెరుగుతుందా? పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వస్తుందా?
'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను చూసిన మోహన్ బాబు
'మా బావ ప్రభాస్‌కు అభినందనలు'.. కల్కి సినిమాను చూసిన మోహన్ బాబు