AAI Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. 32 జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌, అకౌంట్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

AAI Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Airports Authority of India
Follow us

|

Updated on: Oct 03, 2022 | 3:13 PM

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. 32 జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌, అకౌంట్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ఐలాండ్స్‌, సిక్కింలలో పని చేయవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, బీకాం, మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యునికేషన్‌/రేడియో ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌/ఫైర్‌ విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల రెగ్యులర్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

అలాగే హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి లేదా నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ (సెప్టెంబర్‌ 30, 2022) నాటికి ఏడాది మీడియం వెహికల్‌ లైసెన్స్‌ లేదా రెండేళ్లకు ముందుగా లైట్‌ మోటర్‌ వెహికల్‌ లైసెన్స్‌ తీసుకుని ఉండాలి. సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..