ISSOతో చేతులు కలిపిన అదానీ ఇంటర్నేషనల్ స్కూల్.. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచడమే లక్ష్యం!
భారతదేశంలో పాఠశాల స్థాయి క్రీడలకు పెంపొందించేందుకు అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ISSOతో అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ చేతులు కలిపింది. ఇంటర్నేషనల్ స్కూల్‌లలో చదువుతున్న విద్యార్థుల్లో విద్యా, క్రీడా నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రమోటర్ శ్రీమతి నమ్రతా అదానీ తెలిపారు.

భారతదేశంలో పాఠశాల స్థాయి క్రీడలకు పెంపొందించేందుకు, దేశంలోని ఇంటర్నేషన్ స్కూల్‌లలో క్రీడలను మెరుగుపరచడానికి అదానీ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ISSOతో భాగస్వామ్యమైంది. ఈ కలియిక విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించేందుకు, విద్యార్థులు విద్యా, అథ్లెటిక్స్ రెండింటిలోనూ అభివృద్ధి చెందడానికి సహాయపడే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రీడా వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రమోటర్ శ్రీమతి నమ్రతా అదానీ ISSO సలహా బోర్డులో చేరారు. ISSO సలహా బోర్డులో ఆమె చేరిక అంతర్జాతీయ పాఠశాలల్లో క్రీడల భవిష్యత్తును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తెలుస్తోంది. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ.. అదానీ స్కూల్స్, ISSO కలియిక భవిష్యత్తుకు అనుగునంగా ఉండే పాఠశాలలను నిర్మిచడానికి ఒక మంచి అవకాశం ఉన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు చదువులుతో పాటు క్రీడా రంగంలోనూ విజయం సాధించడానికి తాము ప్రోత్సహిస్తామని ఆమె పేర్కొన్నారు.
2017లో స్థాపించబడిన ISSO, IB, కేంబ్రిడ్జ్, ఎడెక్సెల్, NSBA వంటి అంతర్జాతీయ బోర్డులతో అనుబంధంగా ఉన్న పాఠశాలలతో పనిచేస్తున్న ఏకైక భారతదేశానికి చెందిన క్రీడా సంస్థ. ఇది ప్రస్తుతం 22 క్రీడలలో 430కి పైగా పాఠశాలలతో పనిచేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం 300పైగా టోర్నమెంట్లను నిర్వహిస్తుంది.
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




