Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆ బ్యాంక్‌లో అదిరిపోయే వడ్డీరేట్లు.. దేశంలోనే తొలిసారి అలా..

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆ బ్యాంక్‌లో అదిరిపోయే వడ్డీరేట్లు.. దేశంలోనే తొలిసారి అలా..

దీంతో కస్టమర్‌లు రెపో రేటు పెంపుదల బెనిఫిట్స్ వెంటనే అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై డైనమిక్ ఇన్ కం పొందేందుకు వీలు కల్పిస్తుంది.

Venkata Chari

|

Jun 23, 2022 | 5:51 PM

ద్రవ్యోల్బణం.. రెపోరేట్.. వడ్డీ రేట్లు.. ఆర్బీఐ.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాటలు. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడివున్న విషయాలు. దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన మాటలు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణంతో యుద్ధం చేస్తున్నాయి. దానిని ఎదుర్కోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మన దేశం కూడా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుంది. మన దేశ సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు మొదలు పెట్టింది. అందులో భాగంగా రెపో రేట్ పెంచుతూ రెండు సార్లు నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీ రెట్లు పెరిగాయి. వడ్డీరేట్లు పెరగడం అంటే బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రుణాలపై వడ్డీరేటు పెరిగింది. దీంతో సహజంగానే బ్యాంకులు తమపై పడిన భారాన్ని ప్రజల మీదకు తోసేస్తుంటాయి. అయితే, ప్రజలు తీసుకున్న లోన్స్ పై వడ్డీ రేట్లు త్వరత్వరగా పెంచేశాయి. అదే సమయంలో ప్రజలు బ్యాంకులలో ఉంచుకున్న డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపుదల విషయంలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ సరికొత్తగా స్పందించింది.

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, యస్ బ్యాంక్ మంగళవారం అంటే జూన్ 21న ఫ్లోటింగ్ రేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పేరుతో కొత్త ప్రొడక్ట్ ఆఫర్ ప్రారంభించింది. ఈ ప్రొడక్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఈ బ్యాంకులో కస్టమర్లు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆర్బీఐ రేపోరేట్‌తో లింకు అవుతుంది. అంటే.. ఆర్బీఐ రెపోరేట్ పెంచిన వెంటనే ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై దానికి అనుగుణంగా వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. దీనిని మాన్యువల్‌గా చేయాల్సిన పని ఉండదు.

దీంతో కస్టమర్‌లు రెపో రేటు పెంపుదల బెనిఫిట్స్ వెంటనే అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై డైనమిక్ ఇన్ కం పొందేందుకు వీలు కల్పిస్తుంది.

ఇప్పటివరకు రెండు నెలల్లో, RBI అధిక ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి పాలసీ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. మేలో, ఆర్‌బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. తరువాత జూన్ ప్రారంభంలో మళ్ళీ దానిని 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దానితో, RBI పాలసీ రెపో రేటు ప్రస్తుతం 4.90% వద్ద ఉంది.

“ఫ్లోటింగ్ రేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే సెంట్రల్ బ్యాంక్ ప్రచురించిన రెపో రేట్‌లతో అనుసంధానించిన డైనమిక్ రిటర్న్‌లతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ భద్రతను అందించే అసెట్ క్లాస్‌తో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి రూపొందించచిన ఒక ప్రత్యేకమైన ఆఫర్” అని యెస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫ్లోటింగ్ రేట్ FDలను 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ టైమ్ పీరియడ్ డిపాజిట్లపై పొందవచ్చు. డిపాజిట్ మొత్తం కనిష్టంగా ₹10,000 ఉండవచ్చు. కానీ, గరిష్టంగా ₹5 కోట్ల కంటే తక్కువ ఉండాలి.

“YES BANKలో, మేము మా బ్యాంకింగ్ కార్యక్రమాలలో ప్రధానమైన ఆవిష్కరణ, కస్టమర్-సెంట్రిసిటీకి కట్టుబడి ఉన్నాం. డిపాజిట్ విభాగాల్లోని మా కస్టమర్‌లకు అత్యుత్తమ-తరగతి ప్రయోజనాలు, అనుభవాన్ని అందించడానికి మేము స్థిరంగా ప్రయత్నిస్తున్నాం. ఫ్లోటింగ్ రేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక రకమైన FD ఉత్పత్తి, ఇది అటువంటి నిరంతర ప్రయత్నాలకు మరొక నిదర్శనం అని YES బ్యాంక్ MD & CEO ప్రశాంత్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఈ ప్రారంభంతో, యెస్ బ్యాంక్ కూడా 18 నెలలు.. అలాగే అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో సాధారణ కస్టమర్లకు ప్రామాణిక FDలపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 6.50% వరకు పెంచింది. బ్యాంకు సీనియర్ సిటిజన్లకు 3 సంవత్సరాలు అదేవిధంగా అంతకంటే ఎక్కువ కాలం పాటు FD రేట్లను 7.25% వరకు పెంచింది.

ఫ్లోటింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేటుకు సమబంధించిన కీలకమైన విషయాలను ఒకసారి చూద్దాం..

FD మొత్తం:

కనిష్ట డిపాజిట్ మొత్తం ₹10,000, గరిష్టంగా ₹5 కోట్ల వరకు ఉంటుంది.

పదవీకాలం:

ఫ్లోటింగ్ ఎఫ్‌డీ రేటుకు కనీస వ్యవధి 1 సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల కంటే తక్కువ.

ROI రీసెట్ ఫ్రీక్వెన్సీ:

యెస్ బ్యాంక్ ఫ్లోటింగ్ FD రేటును నెలవారీ ప్రాతిపదికన రీసెట్ చేస్తుంది. అంటే ప్రతి నెల మొదటి రోజున రెపో రేటులో మార్పునకు లోబడి FD రేటు ఉంటుంది.

మార్కప్ రేటు:

మార్క్-అప్ రేటు అనేది ఈ సందర్భంలో రెపో రేటు అయిన బేస్ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాంక్ అందించే అదనపు వడ్డీ రేటు అన్నమాట.

1 సంవత్సరం ప్రారంభమయ్యే పదవీకాలానికి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో 1.10% మార్కప్ రేటు ఉంది. రెపో రేటు 4.90%- మార్క్-అప్ రేటు 1.10% పరిగణనలోకి తీసుకుంటే, ఈ పదవీకాలానికి FDలపై వడ్డీ రేటు 6% ఉంటుంది.

అలాగే, 18 నెలల కంటే ఎక్కువ 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో, మార్కప్ రేటు 1.60% వద్ద సెట్ చేశారు. ప్రస్తుతానికి, ఈ పదవీకాలాలపై వడ్డీ రేటు 6.50% (రెపో రేటు 4.90% + మార్క్-అప్ రేటు 1.60%).

ఇక డైనమిక్ వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీ రాబడిని పెంచుకోవచ్చు. మునుపటి నెలలో వర్తించే REPO రేటు ప్రకారం నెలవారీ వడ్డీ రేటు ఆటోమేటిక్ రీసెట్ అవుతుంది. మీ FDలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంతో లిక్విడిటీని ఆస్వాదించండి. ప్రధాన విలువలో 90% వరకు ODతో లిక్విడిటీని ఎంజాయ్ చేయండి. మెచ్యూరిటీ సమయంలో చెల్లింపుతో తిరిగి పెట్టుబడి ఎంపిక మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఇలా డైనమిక్ వడ్డీరేటును అందించడం మన దేశంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ బాటలో దాదాపు అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్ల విషయంలో ఈ డైనమిక్ పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అదీ స్వల్పకాలీక ఇన్వెస్ట్మెంట్ అంటే ఏడాది నుంచి మూడేళ్ళ కాలవ్యవధి కోసం డబ్బును డిపాజిట్ చేయాలని అనుకునే వారికి ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు మళ్ళీ ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇటువంటి పర్శనల్ ఫైనాన్స్‌కి సంబంధించిన విశేషాల కోసం మనీ9 యూ ట్యూబ్ చానల్ చూడండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu