Business Idea: రూపాయి పెట్టుబడి లేకుండా.. లక్షలు సంపాదించే అవకాశం.

ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి కోసమే. పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి.? నష్టం వస్తే ఎలా అనే ఆలోచనతోనే ఉంటారు. అయితే మనకు కాస్త ఆలోచన, మంచి నాలెడ్జ్‌ ఉండాలే కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. ఇలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం....

Business Idea: రూపాయి పెట్టుబడి లేకుండా.. లక్షలు సంపాదించే అవకాశం.
Business Idea
Follow us

|

Updated on: Apr 29, 2024 | 4:39 PM

ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఇది ఒక ప్రకటనే కావొచ్చు. కానీ నిజంగా ఒక మంచి ఆలోచన జీవితాన్ని నిజంగానే మార్చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో రాణించాలనుకునే వారికి కేవలం డబ్బు మాత్రమే కాకుండా. మంచి ఆలోచనలు కూడా పెట్టుబడిగా మారుతుంటాయి. అందుకే మంచి ఆలోచనతో కోట్లు సంపాదించిన వారు చాలా మంది ఉంటారు.

ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి కోసమే. పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి.? నష్టం వస్తే ఎలా అనే ఆలోచనతోనే ఉంటారు. అయితే మనకు కాస్త ఆలోచన, మంచి నాలెడ్జ్‌ ఉండాలే కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. ఇలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ బిజినెస్‌ మరెదో కాదు వెడ్డింగ్‌ ప్లానర్స్‌. ప్రస్తుతం పెళ్లి అనేది ఒక ఈవెంట్‌లాగా మారిపోయింది. అన్ని రకాల సేవల కోసం ఇతరులపై ఆధారపడే రోజులు వచ్చేశాయ్‌.

కాబట్టి మార్కెట్‌లో ఉన్న ఈ అవసరాన్ని గుర్తించి వ్యాపారం ప్రారంభించే లక్షల్లో డబ్బులు ఆర్జించవచ్చు. నిజానికి వెడ్డింగ్‌ ప్లానర్‌ బిజినెస్‌ ప్రారంభించాలంటే డబ్బులు ఉండాలి కానీ. మీరు కేవలం ఒక కన్సల్టెన్సీల మారి వ్యాపారాన్ని ప్రారంభిస్తే అసలు పెట్టుబడి అవసరమే ఉండదు. ఇందుకోసం ముందుగా మీరు పెళ్లికి అసవరమైన అన్ని సేవలు అందించే వారితో ఒప్పందం చేసుకోవాలి. ఉదాహరణకు ఫొటోగ్రాఫర్‌, వంటకాలు, డెకరేషన్‌ ఇలా విభాగాల వారితో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అన్ని సేవలను ఏకతాటిపైకి తీసుకొచ్చి వివాహాన్ని జరిపించాలి.

ఇలా మీకు పెళ్లి చేసుకునే వారి తరఫున అలాగే ఆయా సేవలు అందిస్తున్న వారి తరఫున కమిషన్‌ పొందొచ్చు. అయితే ముందుగా మీ ఐడియాను ప్రమోట్‌ చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలి. అయితే ఒకవేళ మీరు ఈ వ్యాపారంలో రాణిస్తే స్వయంగా మీరే అన్ని సేవలు అందించేలా కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఫొటోగ్రఫీ మొదలు డెకరేషన్‌ వరకు అన్ని మీరే ఏర్పాటు చేసుకొని కూడా ఈవెంట్స్‌ చేయొచ్చు. దీంతో లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు. మరెందుకు ఆలస్యం వచ్చే పెళ్లిల సీజన్‌ నాటికి మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి మరి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..?ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..?ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీశైలం ఘాట్ రోడ్‎లో ప్రమాదం..లోయలో పడిన వాహనం..15 మందికి గాయాలు
శ్రీశైలం ఘాట్ రోడ్‎లో ప్రమాదం..లోయలో పడిన వాహనం..15 మందికి గాయాలు
రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో..
రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో..
టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఏం జరిగిందంటే..
టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఏం జరిగిందంటే..
టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు
టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
'ధనుష్ ఒక గే'.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు
'ధనుష్ ఒక గే'.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు