Bank Rules: క్రెడిట్ కార్డులపైనే కాదు.. సేవింగ్స్ ఖాతాపైనా బాదుడే! ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త రూల్స్ వచ్చాయ్..

ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు తమ సంస్థ నియమ నిబంధనల్లో కొన్ని మార్పులను చేశాయి. ఇవి 2024, మే 1 నుంచి అమలు కానున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాలపై చార్జీలను పెంచాయి. అదే సమయంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల చార్జీలను అప్ డేట్ చేసింది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీపై వడ్డీ రేటును మార్చింది.

Bank Rules: క్రెడిట్ కార్డులపైనే కాదు.. సేవింగ్స్ ఖాతాపైనా బాదుడే! ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త రూల్స్ వచ్చాయ్..
Bank Charges
Follow us

|

Updated on: Apr 29, 2024 | 4:57 PM

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైతే కొన్ని నియమ నిబంధనల్లో సాధారణంగా మార్పులు, చేర్పులు ఉంటాయి. ఆర్థిక సంస్థలు ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని చేస్తుంది. వాటిల్లో వడ్డీ రేట్లు, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు చార్జీలు, ఫిక్స్ డ్, రికరింగ్ డిపాజిట్లలో ఈ మార్పులు మనకు కనిపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు తమ సంస్థ నియమ నిబంధనల్లో కొన్ని మార్పులను చేశాయి. ఇవి 2024, మే 1 నుంచి అమలు కానున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాలపై చార్జీలను పెంచాయి. అదే సమయంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల చార్జీలను అప్ డేట్ చేసింది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీపై వడ్డీ రేటును మార్చింది. ఈ కొత్త మార్పులు మే ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ కేర్ స్పెషల్ ఎఫ్డీ..

హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సీనియర్ కేర్ స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు డెడ్ లైన్ మే10తో ముగుస్తోంది. ఈ పథకం 2020 మేలో ప్రారంభమైంది. సీనియర్ సిటిజెన్స్ ఈ స్పెషల్ ఎఫ్డీలో పెట్టుబడి పెడితే వారికి 7.75 వడ్డీ రేటు వస్తుంది. దీని కాల వ్యవధి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ ఉంటుంది. గరిష్టంగా రూ. 5కోట్ల పెట్టుబడుల వరకూ ఇదే వడ్డీ రేటు అమలులో ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా..

ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలలో పలు నిబంధనలను మార్పు చేసింది. సేవింగ్స్ ఖాతాదారులకు అందించే పలు సర్వీస్ ల ఆధారంగా ఈ చార్జీలు అమలు చేస్తోంది. ఖాతాదారుడు కొత్త డెబిట్ కార్డు తీసుకోవాలనుకుంటే ఒక చార్జీ ఉంటుంది. అలాగే చెక్ బుక్, డిమాండ్ డ్రాఫ్ట్ రద్దు, పే ఆర్డర్, ఐఎంపీఎస్ లావాదేవీలకు విడివిడిగా చార్జీలు వసూలు చేస్తుంది.

ఎస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ చార్జీలు..

ప్రైవేటు రుణదాత అయిన ఎస్ బ్యాంక్ కూడా తమ సేవింగ్స్ ఖాతాలపై కొన్ని నిబంధనలను రివైజ్ చేసింది. దీనిలో ఏడాదికి ఉండాల్సిన మినిమం బ్యాలెన్స్ అవసరాల నిబంధనలు అప్ డేట్ చేసింది. అలాగే ఏటీఎం కార్డు కమ్ డెబిట్ కార్డులపై ఆ కార్డు రకాన్ని బట్టి అదనపు చార్జీలు వసూలు చేస్తుంది. అదే విధంగా ఎస్ బ్యాంక్ క్రెడిట్ హోల్డర్స్ కూడా చార్జీలుకొత్తగా ఉండనున్నాయి. మీరు క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్లు, యుటిలిటీ బిల్స్ అంటే గ్యాస్, ఎలక్ట్రిసిటీ వంటి బిల్స్ కట్టేటప్పుడు కొత్త చార్జీలు విధిస్తుంది.

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రూల్స్..

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే యుటిలిటీ బిల్లులపై చార్జీలు పెంచింది. రూ. 20,000 అంతకన్నా ఎక్కువ చెల్లించే బిల్లులపై 1శాతంతో పాటు అదనంగా జీఎస్టీని వసూలు చేయనుంది. అయితే ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ సెలక్ట్ క్రెడిట్ కార్డులకు ఈ చార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అందం దైవ వరం పొందిందేమో.. ఈ వయ్యారి హృదయాన బందీ అయింది..
అందం దైవ వరం పొందిందేమో.. ఈ వయ్యారి హృదయాన బందీ అయింది..
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో నిబంధనలు మార్పు.. ప్రీమియం పెంపు
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో నిబంధనలు మార్పు.. ప్రీమియం పెంపు
రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికలు.. స్టార్ నటుడు పవన్‌పై తల్లి పోటీ!
రసవత్తరంగా లోక్‌సభ ఎన్నికలు.. స్టార్ నటుడు పవన్‌పై తల్లి పోటీ!
భారమంతా డబుల్ ఇస్మార్ట్‌పైనే.. ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష
భారమంతా డబుల్ ఇస్మార్ట్‌పైనే.. ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష
ఒడియమ్మ బడవా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదట.. కట్ చేస్తే..
ఒడియమ్మ బడవా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదట.. కట్ చేస్తే..
సీరియల్‌లో సాఫ్ట్.. బయట మాత్రం బీభత్సం
సీరియల్‌లో సాఫ్ట్.. బయట మాత్రం బీభత్సం
మీ ఐ ఫోకస్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో '3' నెంబర్ ఎక్కడుందో చెప్పగలరా.?
మీ ఐ ఫోకస్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో '3' నెంబర్ ఎక్కడుందో చెప్పగలరా.?
మీరు ఇంట్లో ఎంత ఆల్కహాల్ నిల్వ ఉంచుకోవచ్చు? నియమాలు ఏమిటి?
మీరు ఇంట్లో ఎంత ఆల్కహాల్ నిల్వ ఉంచుకోవచ్చు? నియమాలు ఏమిటి?
బ్రిటన్ ఎన్నికల్లో.. కరీంనగర్ జిల్లా వాసి.. ఆ పార్టీ నుంచి బరిలో
బ్రిటన్ ఎన్నికల్లో.. కరీంనగర్ జిల్లా వాసి.. ఆ పార్టీ నుంచి బరిలో
హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ..
హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ..