AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alto k10: నెలకు రూ. 5వేలు చెల్లించండి.. మీ కారు కలను నిజం చేసుకోండి

ఇక మరికొందరు సెకండ్ హ్యాండ్‌ కార్లవైపు చూస్తుంటారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొత్త కారు ఇచ్చినట్లు సర్వీస్‌ ఇవ్వవని తెలిసిందే. మరి తక్కువ ధరలో మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అలాంటి ఓ కారు హల్చల్‌ చేస్తోంది. ఇంతకీ ఆ కారు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Alto k10: నెలకు రూ. 5వేలు చెల్లించండి.. మీ కారు కలను నిజం చేసుకోండి
Alto K10
Narender Vaitla
|

Updated on: Apr 29, 2024 | 5:35 PM

Share

ప్రస్తుతం కారు కామన్‌గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వారే కారును ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం మిడిల్‌ క్లాస్‌ వారు కూడా కార్లలో తిరిగే రోజులు వచ్చేశాయ్‌. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. స్వంతంగా ఒక కారు ఉండాలనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది. అయితే ధరకు భయపడి చాలా మంది ఈ ఆలోచనను విరమించుకుంటారు.

ఇక మరికొందరు సెకండ్ హ్యాండ్‌ కార్లవైపు చూస్తుంటారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు కొత్త కారు ఇచ్చినట్లు సర్వీస్‌ ఇవ్వవని తెలిసిందే. మరి తక్కువ ధరలో మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును సొంతం చేసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అలాంటి ఓ కారు హల్చల్‌ చేస్తోంది. ఇంతకీ ఆ కారు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన మారుతి సుజుకీ ఆల్టో కే10 పేరుతో మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. మధ్య తరగతి కుటుంబాల సొంత కారు కలను నిజం చేసింది. నెలకు కేవలం రూ. 5 వేల ఈఎమ్‌ఐ చెల్లించి ఈ కారును సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఆల్టో కే10 కార్‌ బేస్‌ మోడల్‌ ఆన్‌ రోడ ప్రారంభ ధర రూ. 4.50 లక్షలుగా ఉంది. ఈ కారును రూ. 1,35,000 డౌన్‌పేమెంట్ చెల్లించి నెలకు రూ. 5 వేల ఈఎంఐ చెల్లిస్తూ పోతే సరిపోతుంది.

బడ్జెట్‌ తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఇందులో మంచి ఫీచర్లను అందించింది కంపెనీ. ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. లీటర్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్‌ ఇవ్వడం ఈ కారు ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక సీఎన్ జీ వెర్షన్‌లో అయితే 33 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.0 లీటర్‌ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. 66 బీహెచ్ పీ పవర్‌తో పాటు 89 ఎన్ ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఈ కారును తీసుకొచ్చారు. మొత్తం 4 వేరియంట్స్‌లో ఈ కారును లాంచ్‌ చేశారు. గతేడాది మార్కెట్లోకి వచ్చిన ఈ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..