AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డుతో మీ ఆయువు నిలబడుతుంది..ఈ కార్డుతో లాభాలివే..!

ప్రజల ఆర్థిక పరిస్థితి వైద్యం వల్ల తలకిందులవకూడదని తలంపుతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి ఆయుష్మాన్ భారత్ కార్డ్ పథకం కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రారంభించింది. 5 లక్షల వరకు కవరేజీని అందించే ప్రభుత్వ, ఇతర అనుబంధ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందగల అర్హత ఉన్న వ్యక్తులకు ఈ కార్డ్ జారీ చేస్తారు. అయితే ఈ కార్డును పొందేందుకు, తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డుతో మీ ఆయువు నిలబడుతుంది..ఈ కార్డుతో లాభాలివే..!
Ayushman Bharat
Nikhil
|

Updated on: Feb 14, 2024 | 6:30 AM

Share

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న మెడికల్ ఖర్చులు రోగులను భయపెడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మెడికల్ ఇన్సూరెన్స్‌లు ఆదుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే  ఈ ఇన్సూరెన్స్‌ పథకాలు ఉద్యోగులు తీసుకోవడం సాధ్యం అవుతుంది కానీ సాధారణ ప్రజలు మాత్రం వీటికి దూరంగా ఉంటారు. దీంతో అనుకోని ఆపద వచ్చినప్పుడు అప్పులపాలవుతూ ఉంటారు. ప్రజల ఆర్థిక పరిస్థితి వైద్యం వల్ల తలకిందులవకూడదని తలంపుతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి ఆయుష్మాన్ భారత్ కార్డ్ పథకం కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రారంభించింది. 5 లక్షల వరకు కవరేజీని అందించే ప్రభుత్వ, ఇతర అనుబంధ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందగల అర్హత ఉన్న వ్యక్తులకు ఈ కార్డ్ జారీ చేస్తారు. అయితే ఈ కార్డును పొందేందుకు, తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అలాగే నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఆమోదం పొందిన తర్వాత, దరఖాస్తుదారు ఆరోగ్య కార్డును అందుకుంటారు. ఆ పథకం కింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. ఈ కార్డు దరఖాస్తు విధానాన్ని ఓ సారి తెలుసుకుందాం.

అవసరమయ్యే పత్రాలు

  • వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండాలి.
  • కుటుంబంలో 16 ఏళ్లు పైబడిన ఆదాయం పొందే సభ్యులు ఉండకూడదు.
  • ఆదాయ ధృవీకరణ పత్రాలు
  • ఫోటోగ్రాఫ్
  • క్యాస్ట్‌ సరిఫికేట్‌

ఆయుష్మాన్ భారత్ కార్డ్ ప్రయోజనాలు

  • వివిధ ఆసుపత్రులలో చాలా వ్యాధులు మరియు చికిత్సలకు కవరేజ్.
  • ప్రవేశ సేవలతో పాటు ఉచిత చికిత్స
  • రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స.
  • 15 రోజుల ఆసుపత్రి ఖర్చుల కవరేజీ.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా

  • ఆయుష్మాన్ భారత్ కార్డ్ 2024 యొక్క అధికారిక వెబ్‌సైట్ సందర్శించి, మీకు అవసరమైన పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
  • ఏబీహెచ్‌ నమోదుపై క్లిక్ చేసి, ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించండి.
  • అనంతరం నమోదు చేయండి.
  • మీ పేరు, ఆదాయం మరియు పాన్ కార్డ్ నంబర్ వంటి సమాచారాన్ని అందించాలి.
  • అధికారుల ఆమోదం కోసం వేచి ఉండాలి.ఆ తర్వాత మీరు ఆయుష్మాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ కార్డ్ పథకం విపత్తు ఆరోగ్య ఖర్చుల నుండి హాని కలిగించే కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందించడంతో పాటు నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తు ప్రక్రియకు కట్టుబడి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా, వ్యక్తులు ఈ పథకం ద్వారా అందించే ప్రయోజనాలను పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.