EPFO: ఈపీఎఫ్‌వో కీలక సమావేశం.. వారికి రూ.50 వేలు అందనున్నాయా?
EPFO: ఈపీఎఫ్ సభ్యులు సర్వీసులో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్‌ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి. అయితే సర్వీసు ఆధారంగా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది. ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో 0.5 శాతం మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి..

వేతన జీవులకు కనీస బీమాపై ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్లు తెలిపింది. అయితే బీమాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందంటున్నారు. అయితే ఏడాది సర్వీసు పూర్తి కాకముందే ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా కింద కనీస బీమాగా రూ.50వేలు ఇవ్వాలని ఈపీఎఫ్‌వో ప్రతిపాదించింది.
ఇది కూడా చదవండి: Facebook: ఫేస్‌బుక్ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది? కారణం చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్
జీవిత బీమా సదుపాయం:
ఈపీఎఫ్ సభ్యులు సర్వీసులో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్‌ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి. అయితే సర్వీసు ఆధారంగా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది. ఇందుకోసం యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో 0.5 శాతం మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి. ఈనిధులన్నీ ఒకేచోటకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ అవసరాల కోసం ఈడీఎల్‌ఐ కార్పస్ విలువ రూ.42 వేల కోట్లు ఉంటే నికరంగా మిగులు రూ.6,386 కోట్ల వరకు ఉంది.
ఏడాది సర్వీస్ పూర్తి చేకుండా..
ఈపీఎఫ్‌వో చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తిచేయకుండా మరణిస్తే బీమా సహాయం రూ.11వేల నుంచి రూ.13వేల లోపు మాత్రమే ఉంటోంది. ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా రూ.50వేలు చెల్లించాలని ఈపీఎఫ్‌వో ప్రతిపాదించింది. ఏటా రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా.
చందా చల్లించని పక్షంలో..
ఇంకో విషయం ఏంటంటే ఏదైనా అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెల రోజులకన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించదు. ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన ఆరునెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీసు కాలం ప్రకారం మొత్తం లభిస్తుంది.
ఉద్యోగి కంపెనీ మారితే..
ఇక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినపుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒక్కరోజు విఘాతం కలిగినా ఈడీఎల్‌ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు. ఇకపై ఇలాంటి సందర్భాల్లోనూ కనీస బీమా రూ.2.5 లక్షలు అందించాలని భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. ఇక నుంచి ఆ వివరాలు తొలగించడం సులభం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి