Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్.. ఇక నుంచి ఆ వివరాలు తొలగించడం సులభం!
Google: నేటి యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా ఎన్నో పనులు ఆగిపోతాయి. మనం దేని గురించి అయిన తెలుసుకోవాలనుకున్నప్పుడు, మనం తరచుగా Google ని ఉపయోగిస్తాము. మీరు సమాచారాన్ని శోధించడానికి Google Chrome ను కూడా ఉపయోగిస్తుంటే, మీకు శుభవార్త ఉంది...

ఇంటర్నెట్ ఉపయోగించే దాదాపు అందరూ గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తారు. ప్రజలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దాన్ని గూగుల్‌లో వెతుకుతారు. చాలా సార్లు వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా సెర్చింగ్ రిజల్డ్‌లో ఉంటుంది. ఇప్పుడు గూగుల్ సెర్చింగ్ ఫలితాల నుండి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడాన్ని సులభతరం చేసింది. అయితే మీరు సెర్చ్ చేసింది కనిపించకూడదని మీరు భావిస్తే, మీరు దీన్ని సులభంగా తీసివేయవచ్చు. ఇది కాకుండా, ఏదైనా తప్పుడు లేదా పాత సమాచారం మీకు వస్తుంటే, దానిని కూడా అప్‌డేట్ చేయవచ్చు.
ఈ విధంగా మీ సమాచారాన్ని తొలగించండి
గూగుల్ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు తమ సమాచారాన్ని తొలగించడానికి లేదా అప్‌డేట్‌కు అనుమతిస్తుంది. ఇప్పుడు సెర్జింగ్ రిజల్ట్ ముందు ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయడం ద్వారా ఒక కొత్త ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. దీనిలో సమాచారాన్ని తొలగించమని అభ్యర్థన చేయవచ్చు. ఇంటర్‌ఫేస్‌లో మూడు ఎంపికలు ఉంటాయి. వీటిలో “ఇది నా వ్యక్తిగత సమాచారాన్ని చూపిస్తుంది”, “నాకు చట్టపరమైన తొలగింపు అభ్యర్థన,” మరియు “ఇది పాతది, నేను రిఫ్రెష్ కోసం అభ్యర్థించాలనుకుంటున్నాను” అనేవి ఉంటాయి.
ఏ ఎంపికలో ఏమి జరుగుతుంది?
మొదటి ఎంపికలో వినియోగదారులు వారి ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా, ఇంటి చిరునామా, క్రెడిట్ కార్డ్ నంబర్, లాగిన్ ఆధారాలు మొదలైన వాటిని తొలగించవచ్చు. యూజర్ అభ్యర్థనను Google సమీక్షిస్తుంది. ప్రతిదీ సరిగ్గా ఉందని తేలితే వ్యక్తిగత సమాచారం తీసివేస్తుంది. రెండవ ఎంపిక వినియోగదారులు Google ఉత్పత్తి విధానాన్ని ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించడానికి అనుమతిస్తుంది. అయితే మూడవ ఎంపిక వినియోగదారులు ఇంటర్నెట్‌లో తమ గురించి సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి అనుమతిస్తుంది. గూగుల్ ముందుగా అన్ని అభ్యర్థనలను సమీక్షిస్తుంది. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. గూగుల్‌లో “రిజల్ట్స్ అబౌట్ యు” ఫీచర్ కూడా ఉంది. ఇది వ్యక్తిగత సమాచారం కోసం శోధన ఫలితాలను స్కాన్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




