AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: టీటీఈ ఎలాంటి సమయంలో రైలు టికెట్లను చెక్‌ చేయలేరు.. కారణం ఇదే..!

Indian Railways: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. రైలులో ప్రయాణించే ప్రయాణీకులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా ప్రయాణించేలా భారతీయ రైల్వే ఇటువంటి ఏర్పాట్లు చేసింది. అందుకే భారతీయ రైల్వే ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలలో ఒకటి ఏమిటంటే..

Indian Railways: టీటీఈ ఎలాంటి సమయంలో రైలు టికెట్లను చెక్‌ చేయలేరు.. కారణం ఇదే..!
Subhash Goud
|

Updated on: Feb 27, 2025 | 9:30 PM

Share

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. టికెట్‌ ధరలు తక్కువ ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు వ్యవస్థ. గత కొన్ని సంవత్సరాలుగా దానిలో నిరంతర అభివృద్ధి కనిపిస్తోంది. రైలులో ప్రయాణించే చాలా మంది ప్రజలు రిజర్వేషన్ చేసుకుని ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీని వల్ల ప్రయాణం సుఖంగా ఉంటుంది. రిజర్వ్ చేయబడిన కోచ్‌లో టీటీఈ (TTE) ప్రయాణీకుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటారు. అయితే రైళ్లలో టీటీ నియమాలు ఏంటో తెలుసుకుందాం.

టీటీఈ రాత్రి టిక్కెట్లను తనిఖీ చేయలేరు:

భారతీయ రైల్వేలలో ప్రయాణించేటప్పుడు ప్రయాణీకులు భారతీయ రైల్వేలు రూపొందించిన నియమాలను పాటించాలి. అయితే రైల్వేశాఖ రూపొందించిన నిబంధనలను ప్రయాణికులే కాదు రైలు అధికారులు కూడా పాటించాల్సి ఉంటుంది. రైలులో ప్రయాణించే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఇందులో టిక్కెట్‌ చెకింగ్‌కు సంబంధించి కూడా నిబంధనలు రూపొందించారు.

నిబంధనల ప్రకారం, ఒక ప్రయాణికుడు రాత్రిపూట ప్రయాణిస్తుంటే, అప్పుడు టీటీఈ అతని టిక్కెట్‌ను తనిఖీ చేయలేరు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మీ టిక్కెట్‌ను తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఇది నిద్రపోయే సమయం కాబట్టి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రైల్వేశాఖ ఈ నిబంధనను రూపొందించింది.

మీరు రాత్రిపూట రైలులో ఈ పనులు చేయలేరు

రైలులో ప్రయాణించే ప్రయాణీకులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా ప్రయాణించేలా భారతీయ రైల్వే ఇటువంటి ఏర్పాట్లు చేసింది. అందుకే భారతీయ రైల్వే ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలలో ఒకటి ఏమిటంటే ఏ ప్రయాణీకుడు రాత్రిపూట అధిక వాల్యూమ్‌లో సంగీతాన్ని వినకూడదు. ఎందుకంటే ప్రయాణికుల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ నిబంధన ఉంది.

ఈ ఎక్కువ సౌండ్‌తో సంగీతం వినడం వల్ల సమీపంలో కూర్చున్న ఇతర ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనితో పాటు, రాత్రిపూట రైలులో ప్రయాణిస్తున్నప్పుడు లౌడ్‌స్పీకర్‌లో కాల్‌లో ఎవరూ మాట్లాడకూడదు. ఎవరైనా ఇలా చేస్తే, మీరు టీటీఈకి ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్