AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభలేఖలతో ఇంత మోసమా? వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ రాగానే పొలోమని ఓపెన్‌ చేసేయకండి..! చేశారో అంతే సంగతి..

ఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మాల్వేర్‌ను వ్యాపింపజేస్తున్నారు. హానికరమైన APK ఫైల్‌లను ఓపెన్ చేస్తే మీ ఫోన్ నియంత్రణ నేరగాళ్ల చేతికి వెళ్లి, వ్యక్తిగత డేటా, బ్యాంక్ వివరాలు, OTPలు దొంగిలించబడతాయి. డిజిటల్ పెళ్లి పిలుపుల పట్ల అప్రమత్తంగా ఉండండి.

శుభలేఖలతో ఇంత మోసమా? వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ రాగానే పొలోమని ఓపెన్‌ చేసేయకండి..! చేశారో అంతే సంగతి..
Whatsapp Strict Account Set
SN Pasha
|

Updated on: Nov 11, 2025 | 9:49 PM

Share

ఈ డిజిటల్‌ యుగంలో చాలా మంది వాట్సాప్‌లో వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కార్డులను పంపిస్తుంటారు. కొంతమంది వీడియో రూపంలో కూడా ఇన్విటేషన్‌ పంపిస్తున్నారు. అరె.. ఏదో పెళ్లి పిలుపు వచ్చింది కదా అని మనం కూడా వెంటనే ఓపెన్‌ చేసేస్తుంటాం. ఇప్పుడు దీన్ని కూడా సైబర్‌ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకున్నారు. సైబర్ నేరస్థులు WhatsApp వంటి మెసేజింగ్ యాప్‌లలో హానికరమైన Android అప్లికేషన్ ప్యాకేజీ (APK) ఫైల్‌లను షేర్ చేస్తున్నారు. డిజిటల్ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో వీటిని ఒకసారి ఇన్‌స్టాల్ చేస్తే.. ఇక మన డేటాకు, డబ్బుకు మూడినట్టే.

డిజిటల్ వివాహ ఆహ్వానం పేరుతో మెసేజ్ లింక్ నుండి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం వల్ల ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ మాల్వేర్ దాడి చేసే వ్యక్తికి ఫోన్ రిమోట్ కంట్రోల్‌ను ఇస్తుంది. రిమోట్ కంట్రోల్‌తో దాడి చేసే వ్యక్తి పరికరం నుండి SMS సందేశాలు, కాంటాక్ట్‌లు, బ్యాంకింగ్ యాప్‌లు, OTPలు ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసి దొంగిలించవచ్చు. కొన్ని సందర్భాల్లో దాడి చేసే వ్యక్తి ఫోన్‌ను హైజాక్ చేసి బాధితుడి కాంటాక్ట్‌లకు మరిన్ని సందేశాలను పంపుతాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో నివేదించబడిన ఒక కేసులో మహారాష్ట్రలోని ఒక ప్రభుత్వ ఉద్యోగికి వివాహ ఆహ్వానానికి లింక్ లాగా కనిపించే వాట్సాప్ సందేశం వచ్చింది. ఉద్యోగి లింక్‌పై క్లిక్ చేయడంతో అది ఫోన్‌లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఆ లింక్ ద్వారా ఖాతాలోని అన్ని డబ్బులు దొచేశారు. కేరళ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులలో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు డబ్బును కోల్పోయారు. HDFC బ్యాంక్ కూడా ఈ ముప్పు గురించి తన కస్టమర్లను హెచ్చరించింది. అనధికారిక వనరులు లేదా లింక్‌ల నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని వారికి సూచించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి