Vande Bharat: ఈ 3 మార్గాల్లో కొత్తగా వందే భారత్.. సమయ వేళలు ఇవే..!

భారతీయ రైల్వే నిరంతరం వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్రకు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య 11కి చేరుకుంది. భారతీయ రైల్వే ప్రకారం, కొత్తగా ప్రారంభించిన రైళ్లు నాగ్‌పూర్-సికింద్రాబాద్..

Vande Bharat: ఈ 3 మార్గాల్లో కొత్తగా వందే భారత్.. సమయ వేళలు ఇవే..!
Vande Bharat Express Train
Follow us
Subhash Goud

|

Updated on: Sep 18, 2024 | 8:39 PM

భారతీయ రైల్వే నిరంతరం వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మహారాష్ట్రకు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య 11కి చేరుకుంది. భారతీయ రైల్వే ప్రకారం, కొత్తగా ప్రారంభించిన రైళ్లు నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణే, పూణే-హుబ్లీ మార్గాల్లో నడుస్తాయి.

ఈ రైళ్లను ప్రవేశపెట్టడానికి ముందు మహారాష్ట్రలో పశ్చిమ రైల్వే, సెంట్రల్ రైల్వే ద్వారా ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో పశ్చిమ రైల్వే ముంబై-అహ్మదాబాద్, ముంబై-గాంధీనగర్ రూట్లలో వందేభారత్‌ను నడుపుతుండగా, సెంట్రల్ రైల్వే ముంబై-మడ్‌గావ్, ముంబై-సోలాపూర్, ముంబై-సాయి నగర్ షిర్డీ, ముంబై-జల్నా, నాగ్‌పూర్-రాయ్‌పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ మార్గాలు. ఈ ప్రాంతాలలో రైల్వే కనెక్టివిటీ ప్రయాణికులకు మరింత అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర నుండి ప్రారంభమైన మూడు వందేభారత్ రైళ్ల స్టాపేజ్‌లు, టైమ్ టేబుల్‌ గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Metal: ఉక్కు దేనితో తయారవుతుంది? ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఏదీ? భారత్‌ ఏ స్థానంలో..

ఇవి కూడా చదవండి

కొల్హాపూర్-పూణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాలు నడుస్తుంది. పూణే నుంచి మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరి రాత్రి 7:40 గంటలకు కొల్హాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్హాపూర్ నుంచి ఉదయం 8:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు పూణె చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలు మిరాజ్, సాంగ్లీ, కిర్లోస్కర్వాడి, కరాద్, సతార్ వంటి స్టేషన్లలో ఆగుతుంది.

పూణే-హుబ్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు ప్రతి గురు, శని, సోమవారాలు నడుస్తుంది. ఇది పూణె నుంచి సాయంత్రం 4:15 గంటలకు బయలుదేరి రాత్రి 11:40 గంటలకు హుబ్లీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హుబ్లీ నుంచి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు పూణె చేరుకుంటుంది. ఈ రైలు సతార్, సాంగ్లీ, మిరాజ్, బెల్గాం మరియు ధార్వాడ్‌లలో స్టాప్‌లను కలిగి ఉంటుంది.

నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఇది నాగ్‌పూర్‌లో ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలుకు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపట్ వంటి స్టేషన్లలో హాల్టులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Jio AirFiber: జియో నుంచి దీపావళి ధమాకా ఆఫర్.. ఏడాది పాటు ఎయిర్‌ఫైబర్‌ ఉచితం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
చేతులు పొడిబారి దురద పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. టిప్స్ మీకోసం
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
IPL మెగా వేలం సమయం షెడ్యూల్
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!
ఒకే మొబైల్ నంబర్‌కు ఎన్ని ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు!
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
క్రేజీ ఆఫర్స్.. కొత్త కొత్త అవకాశాలు. ఎస్‌జే సూర్య రికార్డ్స్ మోత
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీ పనులకు వెళ్లి వస్తూ ఏడుగురు దుర్మరణం..
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
ఫుల్లుగా తాగి టీ కొట్టు వ్యాపారీతో జైలర్ విలన్ గొడవ.. వీడియో
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
వామ్మో మంటల్లో లారీ.. వెనుకవస్తున్న కార్లకు తప్పిన పెను ప్రమాదం..
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
అయ్యప్ప స్వాములకు ఒకొక్క ఏడాదికి ఒకొక్క పేరు 18 సార్లు తీసుకుంటే
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!