iPhone: ఏ దేశంలో ఐఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? భారత్‌లో ఎంత మంది తెలుసా?

Apple Phones Used: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ ఐఫోన్‌ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఢిల్లీ, ముంబైలలో కూడా కంపెనీ తన స్టోర్లను ప్రారంభించింది...

iPhone: ఏ దేశంలో ఐఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? భారత్‌లో ఎంత మంది తెలుసా?
Follow us
Subhash Goud

|

Updated on: Sep 16, 2024 | 5:33 PM

Apple Phones Used: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ ఐఫోన్‌ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఢిల్లీ, ముంబైలలో కూడా కంపెనీ తన స్టోర్లను ప్రారంభించింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే యాపిల్‌ను ఉపయోగిస్తున్నారని వింటే మీరు ఆశ్చర్యపోతారు. అనేక దేశాల్లో జనాభాలో సగానికి పైగా ఐఫోన్‌ను కలిగి ఉన్నారు. ఏయే దేశాల్లో ఐఫోన్‌లు ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.

యాపిల్ అమెరికా కంపెనీ అయినప్పటికీ అక్కడ 51 శాతం మంది మాత్రమే ఐఫోన్ వినియోగిస్తున్నారు. యూఎస్‌లో 27 శాతం మంది ప్రజలు Samsung ఫోన్‌లను ఉపయోగిస్తుండగా, 22 శాతం మంది ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను ఉపయోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్‌ జపాన్‌లో ఎక్కువ వినియోగిస్తున్నారు. ఈ విషయంలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే దేశంలో 59% మంది వ్యక్తులు ఐఫోన్ కలిగి ఉన్నారు. జపాన్‌లో తొమ్మిది శాతం మంది ప్రజలు దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ ఫోన్‌లను ఉపయోగిస్తుండగా, 32 శాతం మంది ఇతర కంపెనీల ఫోన్‌లను వినియోగిస్తున్నారు. కెనడాలో 56 శాతం, ఆస్ట్రేలియాలో 53 శాతం మంది ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ దేశాల జనాభా యూఎస్‌ కంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ ఐఫోన్‌ వినియోగం ఎక్కువగానే ఉంది.

ఇక భారతదేశంలో 5 శాతం మంది మాత్రమే ఐఫోన్‌ను ఉపయోగిస్తుండగా, 19 శాతం మంది Samsung ఫోన్‌లను కలిగి ఉన్నారు. దేశంలో 76 శాతం మంది ప్రజలు Xiaomi, Vivo, Oppo వంటి చైనా కంపెనీల ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. చైనాలో కూడా 76% మంది Xiaomi, Vivo, Oppo ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. Apple iPhone వినియోగదారులు బ్రిటన్‌లో 48%, చైనాలో 21%, జర్మనీలో 34%, ఫ్రాన్స్‌లో 35%, దక్షిణ కొరియాలో 18%, ఆస్ట్రేలియాలో 53%, బ్రెజిల్‌లో 16%, ఇటలీలో 30%, రష్యాలో 30% ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో 12%, మెక్సికోలో 20%, స్పెయిన్‌లో 29% మంది ఐఫోన్‌ను కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి