Marigold Cultivation: లాభాల పూ‘బంతి’.. పూల సాగుతో నమ్మలేని లాభాలు.. సాగు చేయడంలో ఈ టిప్స్ మస్ట్
ఒకరి కింద ఉద్యోగం చేయడం ఏంటి? అనే ప్రశ్నతో డబ్బు సంపాదించడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో వ్యవసాయ భూమి ఉన్నవారైతే సరికొత్త సాగు పద్ధతులను అవలంభిస్తూ లాభాలను గడిస్తున్నారు. అయితే ఇలాంటి యువ రైతులు పూలసాగు వైపు అడుగుపెడితే మంచి లాభాలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా గోధుమలు, బియ్యం, చెరకు అనేక ఇతర ఉత్పత్తులను పండిస్తారు అయితే తమిళనాడుకు చెందిన రైతు ఒకరు మాత్రం ఒక్కో ఎకరం పూల సాగుకు రూ.80 వేల వరకు లాభం వస్తుందని పేర్కొన్నారు.
భారతదేశం వ్యవసాయం ఆధారిత దేశమని అందరికీ తెలిసిన విషయమే. అయితే మారుతున్న రోజుల నేపథ్యంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది. కానీ కొంత మంది మాత్రం ఒకరి కింద ఉద్యోగం చేయడం ఏంటి? అనే ప్రశ్నతో డబ్బు సంపాదించడానికి సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇందులో వ్యవసాయ భూమి ఉన్నవారైతే సరికొత్త సాగు పద్ధతులను అవలంభిస్తూ లాభాలను గడిస్తున్నారు. అయితే ఇలాంటి యువ రైతులు పూలసాగు వైపు అడుగుపెడితే మంచి లాభాలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా గోధుమలు, బియ్యం, చెరకు అనేక ఇతర ఉత్పత్తులను పండిస్తారు అయితే తమిళనాడుకు చెందిన రైతు ఒకరు మాత్రం ఒక్కో ఎకరం పూల సాగుకు రూ.80 వేల వరకు లాభం వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూల సాగు వల్ల కలిగే లాభాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
తిరువారూర్ జిల్లా కొడవాసల్ పంచాయతీ సమీపంలోని నాలూర్ గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం బంతి పూలు సాగు చేస్తుంటాడు. గత 8 ఏళ్లుగా తన వ్యవసాయ భూమిలో పూల సాగు చేస్తున్నానని చెప్పారు. పండుగల సీజన్‌లో పూల మార్కెట్‌లో మంచి లాభాలు వస్తాయని రైతు తెలిపారు. అయితే తాను ఒసూరు ప్రాంతం నుంచి పూల గింజలు కొంటున్నట్లు వివరించారు. వాటిని కొన్న తర్వాత తన భూమిలో విత్తనాలు వేస్తాడు. ఈ మొక్కలు పెరిగి 45 రోజుల్లో పూలు కోతకు సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా బంతి పూలను సాగు చేసి వాటిని ప్రతి 3 రోజులకు కోసి మార్కెట్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో పూల ధరలు పెరుగుతాయి కాబట్టి ఎకరాకు రూ.10 వేల పెట్టుబడితో ఎకరానికి రూ.80 వేలు లాభం వస్తుందని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
తమిళనాడులో ఆర్థిక వ్యవస్థకు అత్యంత దోహదపడే రంగాలలో వ్యవసాయంగా ఒకటిగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో దాదాపు 70 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం చేస్తున్నారు. తమిళనాడులోని కొన్ని ముఖ్యమైన పంటలలో చెరకు, పత్తి, నూనె గింజలు, కాఫీ, టీ, మామిడి మరియు అరటిపండ్లు ఉన్నాయి. భారతదేశంలో పూలను అత్యధికంగా పండించేది తమిళనాడు. అలాగే మామిడి, కొబ్బరిని రెండవ అతిపెద్ద సాగుగా ఉంది. భారతదేశంలో కూరగాయల ఉత్పత్తిలో 6 శాతం మరియు పండ్ల ఉత్పత్తిలో 10 శాతం వరకు రాష్ట్రం వాటాను కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..