AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

True Caller: ఐఫోన్ వినియోగదారులకు ట్రూ కాలర్ గుడ్‌న్యూస్.. లైవ్ కాలర్ ఐడీ ప్రారంభం

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్స్‌లోని వివిధ యాప్స్ అధిక ప్రజాదరణ పొందాయి. మనకు ఎవరు ఫోన్ చేశారో తెలుసుకునే సదుపాయం ఉన్న ట్రూ కాలర్ యాప్ అందరూ ఇష్టపడుతున్నారు. అయితే ట్రూ కాలర్ కూడా కొన్ని ప్రత్యేక ఫీచర్లను లాంచ్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

True Caller: ఐఫోన్ వినియోగదారులకు ట్రూ కాలర్ గుడ్‌న్యూస్.. లైవ్ కాలర్ ఐడీ ప్రారంభం
True Caller
Nikhil
|

Updated on: Jan 24, 2025 | 4:15 PM

Share

ట్రూ కాలర్ కొన్ని సంవత్సరాలుగా దాని ఫ్లాగ్‌షిప్ ఫీచర్ అయిన లైవ్ కాలర్ ఐడీను ఐఓఎస్‌లో అందుబాటులో ఉంచలేదు. ఐఫోన్స్‌పై ట్రాక్షన్‌ను పొందేందుకు ట్రూ కాలర్ చాలా కష్టపడింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు కాలర్‌ల రియల్ టైమ్ గుర్తింపును ఆశ్వాదించగా, ఐఫోన్ వినియోగదారులు కాల్ స్వీకరించిన తర్వాత మాత్రమే మాన్యువల్‌గా నంబర్‌లను శోధించే సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం లైవ్ కాలర్ ఐడీ ఫీచర్ ఐఫోన్ వినియోగదారులకు అధికారికంగా అందుబాటులో ఉంది. ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెడి సెప్టెంబర్ 2024లో ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం తీసుకొచ్చిన అప్‌డేట్ ట్రూకాలర్‌ను ఐఓఎస్ సామర్థ్యాలతో మరింతగా బలపరుస్తుందని తెలిపారు. యాపిల్‌కు సంబంధించిన స్థానిక కాలర్ ఐడీ సూచనలతో పోటీపడేలా యాప్‌ని అనుమతిస్తుంది.

యాపిల్‌కు సంబంధించిన సిస్టమ్ సందేశాలు, ఈ-మెయిల్‌ల నుంచి డేటా ఆధారంగా సంభావ్య కాలర్ గుర్తింపులను సూచిస్తుంది. అయితే అధిక కచ్చితత్వం కోసం ట్రూ కాలర్ దాని విస్తృతమైన గ్లోబల్ డేటాబేస్ ఫోన్ నంబర్‌లు, ఐడీలను ప్రభావితం చేస్తుంది. ఈ అప్‌డేట్‌తో ఐఫోన్ వినియోగదారులు లైవ్ కాలర్ ఐడీ, స్పామ్ కాల్ బ్లాకింగ్, ఇటీవలి కాల్ లిస్ట్‌లో 2,000 నంబర్‌ల వరకు శోధించదగిన కాల్ హిస్టరీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. వినియోగదారులందరూ ప్రపంచవ్యాప్తంగా స్పామ్-బ్లాకింగ్ ఫీచర్‌లను యాక్సెస్ చేయగలిగినప్పటికీ కొన్ని ఫీచర్లు ట్రూ కాలర్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకు ప్రత్యేకంగా ఉంచారు. ప్రీమియం వినియోగదారులు ప్రకటనలు లేకుండా లైవ్ కాలర్ ఐడీను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఉచిత వినియోగదారులు ఇప్పటికీ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు కానీ ప్రకటన అంతరాయాలతో వినియోగించాల్సి ఉంటుంది. 

లైవ్ కాలర్ ఐడీ యాక్టివేషన్ ఇలా

  • లైవ్ కాలర్ ఐడీ ఫీచర్ ఐఫోన్ ఐఓఎస్ 18.2 లేదా తర్వాతి వెర్షన్‌లో మాత్రమే పని చేస్తుంది. 
  • ముందుగా ట్రూ కాలర్ యాప్‌ని వెర్షన్ 14.0 లేదా తర్వాత వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలి. 
  • ఐఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లి అక్కడ యాప్‌లను ఎంచుకుని, అనతంర ఫోన్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని కాల్ బ్లాకింగ్ & ఐడెంటిఫికేషన్‌కు వెళ్లి అన్ని ట్రూకాలర్ స్విచ్‌లను ప్రారంభించాలి. 
  • ఆటోమేటిక్ సెటప్ కోసం ట్రూ కాలర్ యాప్‌ని తెరవాలి. 
  • మీరు ఈ దశలతో మీ ఐఫోన్‌లో ట్రూ కాలర్ ప్రత్యక్ష కాలర్ ఐడీను అనుభవించవచ్చు. 

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ కాల్ మేనేజ్‌మెంట్, స్పామ్ రక్షణను మెరుగుపరిచేటప్పుడు ఐఓఎస్ వినియోగదారులకు యాప్‌నకు సంబంధించిన ఆకర్షణను గణనీయంగా పెంచుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి