AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit card: ఈ క్రెడిట్ కార్డు తో అనేక ప్రయోజనాలు.. లావాదేవీలతో ఆఫర్లే ఆఫర్లు..!

ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు వీటిని అందజేస్తున్నాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డు లేని ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. వీటి ద్వారా ఆర్థిక లావాదేవీలు గణనీయంగా జరుగుతున్నాయి. అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటున్నారు.

Credit card: ఈ క్రెడిట్ కార్డు తో అనేక ప్రయోజనాలు.. లావాదేవీలతో ఆఫర్లే ఆఫర్లు..!
Nikhil
|

Updated on: Jan 24, 2025 | 4:30 PM

Share

క్రెడిట్ కార్డుల ద్వారా కస్టమర్లకు కొన్ని రాయితీలు, డిస్కౌంట్లను ఆయా బ్యాంకులు అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఇడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు నుంచి ఫస్ట్ ఎర్న్ రూపే అనే క్రెడిట్ కార్డు విడుదలైంది. దీని ద్వారా అందిస్తున్న ప్రత్యేకతలను తెలుసుకుందాం. ఫస్ట్ ఎర్న్ రూపే కార్డుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ తో లింక్ అయ్యే క్రెడిట్ కార్డు. దీని ద్వారా రివార్డులు, ఎఫ్ డీపై మంచి వడ్డీ రేటుతో పాటు యూపీఐ ద్వారా క్రెడిట్ లిమిట్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేటి కాలంలో ప్రజలకు అవసరాలను తీర్చే ఫీచర్లు, బెనిఫిట్లతో ఈ కార్డును తీసుకువచ్చారు.

యూపీఐ పేమెంట్లు

యూపీఐ ద్వారా క్రెడిట్ యాక్సెస్, రివార్డులు పొందడంతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ కావాలనుకునే వారికి ఈ క్రెడిట్ కార్డు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, ఇతర ఫీచర్లను ఉపయోగించుకుని క్రెడిట్ హిస్టరీని కూడా మెరుగుపర్చుకోవచ్చు.

క్యాష్ బ్యాక్ ఆఫర్

క్రెడిట్ కార్డు ద్వారా ఖాతాదారులకు కొన్ని ఆఫర్లను బ్యాంకు అందజేస్తోంది. కొత్త కార్డు హోల్డర్లు మొదటి యూపీఐ టాన్సాక్షన్ పై వంద శాతం క్యాష్ బ్యాక్ అందుకుంటారు. ఇలా కార్డు తీసుకున్న 15 రోజుల్లో రూ.500 వరకూ బెనిఫిట్లు అందిస్తారు. మొదటి సంవత్సరం చేసిన ఖర్చులను క్యాష్ రూపంలో రీఫండ్ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

క్యాష్ బ్యాక్ రివార్డులు

ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు యాప్ తో చేసే యూపీఐ లావాదేవీలకు రివార్డులు లభిస్తాయి. ఖాతాదారులకు ఒక శాతం క్యాష్ బ్యాక్ అందుతుంది. అలాగే ఇతర యూపీఐ యాప్ లతో చేసే ఇన్స్యూరెన్స్, యుటిలీటీ బిల్లులు, ఆన్ లైన్ షాపింగ్ తదితర 0.50 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తారు.

ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీ

ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకులో ఒక ఏడాది ఒక్క రోజు కాల పరిమితికి చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఏడాదికి 7.25 శాతం వడ్డీని అందిస్తారు. ఈ క్రెడిట్ కార్డుకు రూ.1399 విలువైన కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. లాస్ట్ కార్డు లయబిలిటీ రూ.25 వేలు. వ్యక్తిగత ప్రమాద బీమా రూ.2 లక్షల వరకూ లభిస్తుంది. అయితే ఎఫ్ డీ ద్వారా పొందే ఈ కార్డుకు ఫీజుగా ఏటా జీఎస్టీతో కలిపి రూ.499 చెల్లించాలి.

క్రెడిట్ లిమిట్

ఫిక్స్ డ్ డిాపాజిట్ చేసే మొత్తం ఆధారంగానే ఫస్ట్ ఎర్న్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. దానికి అనుగుణంగానే క్రెడిట్ లిమిట్ ఉంటుంది. మీ ఎఫ్ డీ మీ క్రెడిట్ కార్డుకు లింక్ చేస్తారు. దాని ఆధారంగా క్రెడిట్ లిమిట్ సెట్ అవుతుంది. డిఫాల్టర్లు, క్రెడిట్ రిస్కులను తగ్గించే ఉద్దేశంతో ఈ విధమైన ఏర్పాటు చేశారు. ఖాతాదారుడు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే బ్యాంక్ ఎఫ్ డీ క్లెయిమ్ చేసుకుంటుంది. యాన్యువల్ ఫీజు విధించిన రోజు నుంచి 15 రోజుల్లోపు బ్యాంకు యాప్ ద్వారా చేసిన మొదటి నాలుగు యూపీఐ లావాదేవీలపై వంద శాతం క్యాష్ బ్యాక్ అంటే రూ.200 వరకూ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి