Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు అదిరే గుడ్ న్యూస్.. కంటెంట్ అప్ లోడ్ మరింత సులభం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ దీన్ని ఇన్ స్టాల్ చేసుకుంటారు. స్మార్ట్ ఫోన్లలో ఏ యాప్ లేకపోయినా సరే వాట్సాప్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. నిత్య జీవితంలో వివిధ పనులకు చాలా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు యాప్ లో అప్ డేట్లు చేస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది.

తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్ల తమ స్టేటస్ అప్ డేట్ లను నేరుగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో అప్ లోడ్ చేయగలుగుతారు. వాట్సాప్ మెసేజింగ్ ను యాప్ ను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్ లకు అనుసంధానం చేసేందుకు మెటా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. దీని కొత్త వాట్సాప్ లో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు ఒకేసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో తమ కంటెంట్ ను అప్ లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఫీచర్ ఐచ్చికంగా, డీఫాల్ట్ గా ఆఫ్ చేయబడింది. వినియోగదారులు తమ ప్రాధాన్యతల ప్రకారం దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా విస్తరించింది. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది, దేశ ప్రజల మధ్య సరిహద్దులను చెరిపివేసింది. ప్రతి ఒక్కరూ తమ సంతోషం, బాధలు, ప్రయాణాలు, శుభకార్యాలు. తమ ప్రాంతంలో వింతలు , విశేషాలను దీని ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు. ఇలాంటి సోషల్ మీడియా యాప్ లలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రముఖంగా ఉంటాయి. గతంలో వీటిలో కంటెంట్ ను వేర్వేరుగా అప్ లోడ్ చేసేవారు. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ లో రాబోతున్న ఫీచర్ తో ఒకేసారి కంటెంట్ ను ఈ మూడు మెటా ఖాతాల్లోకి అప్ లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. దీని కోసం వాట్సాప్ ఖాతాను మెటా ఖాతాల కేంద్రానికి లింక్ చేసుకోవాలి.
స్టేటస్ అప్‌లోడ్ ఇలా
- ముందుగా వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. దాని తాజా వెర్షన్ ను ఉపయోగిస్తున్నారని నిర్ధారణ చేసుకోండి.
- యాప్ ను తెరిచి లోపలున్న సెట్టింగ్ ల మెనూకి వెళ్లండి.
- దానిలో మీ ఖాతాను జోడించు అనే ఆప్షన్ కోసం చూడండి. ఒకవేళ మీకు కనిపించకపోతే మీకు ఆ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదని గమనించాలి.
- ప్రాంప్టులను అనుసరించండి. మీ మెటా ఖాతా ఆధారాలతో లాగిన్ అవ్వండి.
- కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో వాట్సాప్ స్టేటన్ అప్ డేట్ లను ప్రారంభించడానికి ఎంపికలను క్లిక్ చేయాలి.
- ఎప్పుడైనా మీకు ఈ ఫీచర్ వద్దనుకుంటే సెట్టింగ్ లోకి వెళ్లి, ఖాతాల కేంద్రం నుంచి వాట్సాప్ ను అన్ లింక్ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








