Gold Prices Today: వామ్మో.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. ఈ రోజు ఏకంగా ఎంత పెరిగిందంటే..?
బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం నుంచి ఏకదాటిగా పెరుగుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. ఒక్కరోజు కూడా తగ్గి సామాన్యులకు ఊరట ఇవ్వడం లేదు. శుక్రవారం గోల్డ్ రేట్లు మరోసారి పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..

అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. రోజురోజుకి వీటి రేట్లు ఆకాశాన్నంటుతూనే ఉన్నాయి. బంగారంకు పోటీగా వెండి రేట్లు భారీ స్ధాయిలో పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. వెండి ధర వేలకు వేలు పెరుగుతోంది. అసలే పండుగల సీజన్ కావడం, బంగారం ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు షాక్ అవ్వుతున్నారు. గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయోనని అందరూ ఎదురుచూస్తున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తులం బంగారం ఎంతంటే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.39.260 వద్ద కొనసాగుతుండగా.. నిన్న రూ.1,39,250 వద్ద స్థిరపడింది.ఇక 22 క్యారెట్ల ధర రూ.1,27,660గా ఉంది
-ఇక విజయవాడలో 24 క్యారెట్ల ఫ్యూర్ బంగారం ధర రూ.1,39,260 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,660 వద్ద కొనసాగుతోంది
-విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,260 వద్ద ఉండగా.. 22 క్యారెట్లు వచ్చి రూ.1,27,660 వద్ద పలుకుతోంది
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,410 వద్ద ఉండగా..22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,810 వద్ద కొనసాగుతోంది
-ఇక చెన్నై విషయానికొస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,870 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,28,210గా ఉంది
-బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,39,260 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,660గా ఉంది
వెండి ధరలు..
-బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,34,100 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.2,34,000 వద్ద స్ధిరపడింది.
-హైదరాబాద్‌లో కేజీ వెండి శుక్రవారం రూ.2,45,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,45,100 వద్ద పలుకుతోంది. ఇక బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
