Home Loan: అతి తక్కువ వడ్డీకి హోమ్ లోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్! క్రెడిట్ స్కోర్ ఎంతుంటే..
మీరు 2026లో గృహ రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? తక్కువ వడ్డీ రేట్లను ఎంచుకోవడం ద్వారా లక్షలు ఆదా చేసుకోవచ్చు. LIC హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 7.15 శాతం నుండి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ రేట్లు మారుతాయి.

మీరు గృహ రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఇది మీ కోసమే.. 2026 కొత్త సంవత్సరంలో గృహ రుణం తీసుకొని మీ స్వంత ఇల్లు కొనాలని మీరు ఆలోచిస్తుంటే, మొదట మీరు వివిధ బ్యాంకులు, NBFCల వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న బ్యాంకు నుండి గృహ రుణం తీసుకోవాలి. గృహ రుణం పెద్ద, దీర్ఘకాలిక రుణం కాబట్టి వడ్డీ రేట్లలో 1 శాతం వ్యత్యాసం కూడా మీకు లక్షల రూపాయలు ఆదా చేస్తుంది. ఈ రోజు మనం తన వినియోగదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలు ఇస్తున్న సంస్థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
LIC హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం తన కస్టమర్లకు చాలా తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. LIC హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణాలకు ప్రారంభ వడ్డీ రేటు 7.15 శాతం. మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే, మీరు LIC హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణం నుండి 7.15 శాతం వడ్డీ రేటుతో రూ.5 కోట్ల వరకు గృహ రుణాన్ని పొందవచ్చు. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు. LIC హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణాలకు వడ్డీ రేట్లు కస్టమర్, క్రెడిట్ స్కోరు ప్రకారం మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్లు క్రింది విధంగా ఉన్నాయి.
కస్టమర్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు
825 కంటే ఎక్కువ – 7.15 శాతం
800 నుండి 824 – 7.25 శాతం
775 నుండి 799 – 7.35 శాతం
750 నుండి 774 – 7.45 శాతం
725 నుండి 749 – 6.65 శాతం
700 నుండి 724 – 7.95 శాతం
600 నుండి 699 – 8.75 శాతం
600 నుండి 9.55 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
