AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flat dispute: ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేసిన బిల్డర్.. బుద్ది చెప్పిన హర్యానా దంపతులు

ప్రతి ఒక్కరికీ జీవితంలో అనేక కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాకారం చేసుకోవడానికి అనునిత్యం కష్టపడతారు. వాటిలో సొంతిల్లు సమకూర్చుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే సొంతింటితోనే సమాజంలో గుర్తింపు ఉంటుంది. మనకు శాశ్వత చిరునామా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సొంతింటిని సమకూర్చకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు.

Flat dispute: ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేసిన బిల్డర్.. బుద్ది చెప్పిన హర్యానా దంపతులు
Flats
Nikhil
|

Updated on: Jan 24, 2025 | 5:00 PM

Share

ఓ వ్యక్తి అపార్టుమెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి బిల్డర్ కు రూ.1.07 కోట్లు చెల్లించాడు. దాదాపు పదేళ్లయినా ఫ్లాట్ కట్టి ఇవ్వకపోవడంతో విసుగు చెంది, ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. దీంతో సదరు బిల్డర్ రూ.2.26 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. హర్యానాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (హర్యానా రేరా) ఇటీవల ఓ బిల్డర్ పై చర్యలు తీసుకుంది. కొనుగోలుదారుడికి సమయానికి ఫ్లాట్ ఇవ్వకపోవడంతో జరిమానా కట్టాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఓ జంట 2013లో అపార్టుమెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేయాలని భావించారు. ఇందుకోసం ఓ బిల్డర్ ను ఆశ్రయించారు. రూ.1.16 కోట్ల విలువైన ఫ్లాట్ కోసం రూ.12 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించి బుక్కింగ్ చేసుకున్నారు. అనంతరం ఏడాదికి రూ.95 లక్షలు కట్టేశారు. నిబంధనల ప్రకారం అన్ని అగ్రిమెంట్లు పూర్తి చేసుకున్నారు. అయితే బిల్డర్ కనీసం ఫ్లాట్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించపోవడంతో అవాక్కయ్యారు.

ఫ్లాట్ పనులు మొదలు కాకపోవడంతో నేరుగా బిల్డర్ కార్యాలయానికి ఆ దంపతులు వెళ్లారు. తమ బుక్కింగ్ ను రద్దు చేసుకుంటామని డబ్బుల వాపసు ఇవ్వాలని కోరారు. అయితే బిల్డర్ వారికి నచ్చచెప్పి, మరో చోట రూ.1.55 కోట్లకు మరో ఫ్లాట్ ను ఇస్తానని చెప్పాడు. ఆ దంపతులు కూడా దానికి ఒప్పుకుని మిగిలిన డబ్బును ఇవ్వడానికి సిద్దపడ్డారు. అయితే బిల్డర్ ఆ ఫ్లాట్ కు కూడా సమయానికి పూర్తి చేయలేకపోయాడు. గట్టిగా అడిగిన దంపతులకు మరో చోట్ల ఫ్లాట్ ఇస్తానని చెప్పాడు. కానీ ఆ హామీని కూడా నెరవేర్చకోలేదు.

ఫ్లాట్ కోసం డబ్బులు కట్టి పది సంవత్సరాలు పూర్తి కావడం, బిల్డర్ మోసం చేయడంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. బిల్డర్ ఆఖరి వాగ్దానం అయిన 2022 జూలై 21న కూడా ఫ్లాట్ ఇవ్వకపోవడంతో విసిగిపోయారు. దీంతో హర్యానా రేరాకు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి అన్ని వివరాలు అందించారు. బాధితుడి ఫిర్యాదుపై హర్యానా రేరా అధికారులు రంగంలోకి దిగారు. సదరు బిల్డర్ ను పిలిచి విచారణ చేపట్టారు. ఫ్లాట్ పూర్తికాకపోవడానికి బిల్డర్ పలు కారణాలు తెలిపాడు. అయితే అవి సరికాదని, కొనుగోలుదారుడిని మోసం చేయడానికి బిల్డర్ ప్రయత్నించాడని నిర్దారించారు. దీంతో బాధితుడిని రూ.2.26 కోట్లు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి