AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Account: మీరు ఎస్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో వేరే బ్రాంచ్‌కు మార్చాలని అనుకుంటున్నారా..? మరింత సులభం

SBI Account:మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతా ఉందా..? మీ ఖాతాను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవాలని భావిస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. వేరే బ్రాంచ్‌కు మారాల్సి..

SBI Account: మీరు ఎస్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో వేరే బ్రాంచ్‌కు మార్చాలని అనుకుంటున్నారా..? మరింత సులభం
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 11, 2021 | 7:56 PM

Share

SBI Account:మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో ఖాతా ఉందా..? మీ ఖాతాను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవాలని భావిస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. వేరే బ్రాంచ్‌కు మారాల్సి వస్తే బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కరోనా మహమ్మారి కాలంలో బ్యాంకుకు వెళ్లే పరిస్థితేమి లేదు. ఇలాంటి సమయంలో ఎస్‌బీఐ బ్యాంకు చుట్టూ తిరగకుండా ఓ సదుపాయం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు అకౌంట్‌ను మీరు కావాల్సిన బ్రాంచ్‌కు సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికే ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లకు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) కూడా ఈ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎస్‌బీఐ కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు ఆన్‌లైన్‌లో సులభంగా మార్చుకోవచ్చు. దీని వల్ల కస్టమర్లకు సమయం చాలా ఆదా అవుతుంది. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ లో తమ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు సులభంగా మార్చుకునే సదుపాయం ఉంది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లు యోనో ఎస్‌బీఐ, యోనో లైట్‌ యాప్‌లతో పాటు ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కూడా బ్యాంకు అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు సింపుల్‌గా మార్చుకోవచ్చు.

అయితే ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు మార్చే ముందు కొన్ని విషయాలను గుర్తించుకోవడం తప్పనిసరి. మీ అకౌంట్‌ మార్చే ప్రక్రియలో ఖాతా నెంబర్‌, బ్రాంచ్‌ కోడ్‌ లాంటి వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేకపోతే అది సక్సెస్‌ కాదు. అలాగే ఎస్‌బీఐలో మీ మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ అయి ఉండాలి. అయితే ఓటీపీ పొందడానికి మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేయడం తప్పనిసరి. ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మీరు నిమిషాల్లోనే అకౌంట్‌ను వేరే బ్రాంచ్‌కు మార్చుకోవచ్చు. లేకపోతే సమయం వృధా అవుతుంది. అందుకు ఈ స్టెప్పులను తప్పకుండా అనుసరించాలి. అవేంటంటే..

మీ ఎస్‌బీఐ అకౌంట్‌ వేరే బ్రాంచ్‌కు మార్చేందుకు ముందుగా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Personal Banking ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. e-service ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Transfer Savings Account పైన క్లిక్ చేయాలి. మీకు ఒకటి కన్నా ఎక్కువ ఎస్‌బీఐ అకౌంట్లు ఉంటే ఏ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ బ్యాంకు బ్రాంచ్‌కు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయడం మార్చిపోవద్దు.

ఇక పూర్తి వివరాలు సరి చూసుకున్నాక Confirm బటన్ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Confirm బటన్ పైన క్లిక్ చేయాలి. కొన్ని రోజుల్లోనే మీ అకౌంట్ మీరు కోరుకున్న బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆ సమాచారం మీకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా వస్తుంది. అలాగే యోనో యాప్, యోనో లైట్ యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్ధతిలో మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను మరో బ్రాంచ్‌కు మార్చుకోవచ్చు. దీని వల్ల మీరు బ్రాంచ్‌కు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే ఉండి ఈ పని సులభంగా చేసుకోవచ్చు.

ఇవీ కూడా  చదవండి:

SpiceJet Offers: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే ఆఫర్‌.. 30 శాతం డిస్కౌంట్‌

LIC Jeevan Akshay Pension Plan: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి