Petrol Diesel Price: ఇంధన ధరలు ఇలా పెరుగుతూనే ఉంటాయా.? హైదరాబాద్‌లో సెంచరీకి చేరువుతోన్న లీటర్ పెట్రోల్..
Petrol Diesel Price Today: దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అన్నది లేనట్లు దూసుకుపోతున్నాయి. రోజుకు పది పైసలు, 20 పైసలు చొప్పున పెరుగుతూ...
Petrol Diesel Price Today: దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అన్నది లేనట్లు దూసుకుపోతున్నాయి. రోజుకు పది పైసలు, 20 పైసలు చొప్పున పెరుగుతూ లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 100కు చేరువవుతున్నాయి. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే లీటర్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ కొట్టేసింది కూడా. ఇక శనివారం కూడా ఇంధన ధరలకు బ్రేక్ పడలేదు. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
* న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.76 గా ఉండగా, డీజిల్ రూ. 85.66 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.98 కాగా, లీటర్ డీజిల్ రూ. 92.99 గా ఉంది.
* చెన్నైలోనూ ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.23 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.38 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.92 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 90.81 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల పెరుగుదల శనివారం కూడా కొనసాగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.48 గా ఉండగా డీజిల్ రూ. 93.38 వద్ద కొనసాగుతోంది.
* తెలంగాణలో మరో ముఖ్య పట్టణం కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.63 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 93.50 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.89 వద్ద ఉండగా.. డీజిల్ రూ. 95.19 గా ఉంది.
* విశాఖలో లీటర్ పెట్రోల్ రూ. 99.90 కాగా.. డీజిల్ రూ. 94.36 వద్ద కొనసాగుతోంది.
Also Read: Horoscope Today: ఆ రాశుల వారంతా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. శనివారం రాశి ఫలాలు ..
RSS Meet in Delhi: హస్తినలో నేడు ఆర్ఎస్ఎస్ కీలక భేటీ.. యూపీ ఎన్నికలు సహా ఆ అంశాలపై ప్రత్యేక ఫోకస్