Tata EV: ఎలక్ట్రిక్ కార్ల రేసులోకి దూసుకొచ్చిన టాటా.. ఏకంగా మూడు మోడళ్లు లాంచ్.. లుక్, ఫీచర్స్ మామూలుగా లేవుగా..
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనుంది. ఆయా కార్ల లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వంటి వాటి గురించి తెలుసుకుందాం..

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బాట పట్టింది. 2023 ఆటో ఎక్స్ పోలో అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ వెహికల్స్(EV) లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. తన సంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీ లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్లు నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టైగోర్ ఈవీలకు తోడు మరికొన్ని కొత్త వాటని కూడా ఆవిష్కరించనుంది. అలాగే సఫారీ, హారియర్ ఎస్ యూవీలను కూడా ప్రదర్శించనుంది.
మూడు కొత్త కార్లు..
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించనుంది. దానిలో మొదటిది టాటా పంచ్ ఈవీ. ఇది పంచ్ సబ్ కాంపాక్ట్ SUV శ్రేణికి చెందిన కారు. దీనికి అదనంగా, కంపెనీ కర్వ్ ఎస్యూవీ కూపే ఈవీ కాన్సెప్ట్, అలాగే అవిన్యా ఈవీ కాన్సెప్ట్‌ను ఆటో షోలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా కార్ల లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వంటి వాటి గురించి తెలుసుకుందాం..
టాటా పంచ్ ఈవీ..
పంచ్ ఈవీ వాహనాన్ని GEN 2 (SIGMA) ప్లాట్‌ఫారమ్‌లో రూపొందిస్తున్నారు, ఇది ALFA మోడల్ కు మోడిఫైడ్ వెర్షన్. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వచ్చే అవకాశం ఉంది. 26kWh, 30.2kWh సామర్థ్యంతో ఉంటుంది. ఈ బ్యాటరీలను ఒకసారి చార్జ్ చేస్తే 300కిమీల మైలేజీ వస్తుంది.
టాటా కర్వ్..
2022 ఏప్రిల్లోనే కర్వ్ ఈవీ కాన్సెప్ట్‌ను టాటా కంపెనీ ప్రదర్శించింది. దీని రేంజ్ 400కిలోమీటర్లు ఉంటుంది. 40kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీ, మహీంద్రా ఎక్స్ యూవీ 400 వంటి వాటికి పోటీగా టాటా దీనిని తీసుకొస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
టాటా అవిన్యా..
విన్య అనేది GEN 3 ఆర్కిటెక్చర్‌పై ఆధారపడిన టాటా బ్రాండ్ మొదటి కాన్సెప్ట్ మోడల్. ‘బోర్న్ ఎలక్ట్రిక్’ గా ఇది పలు రకాల డిజైన్లలో లభిస్తుంది. దీని పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. టాటా తన GEN 3 ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించే అన్ని భవిష్యత్ ఈవీలూ 500km కంటే ఎక్కువ రేంజ్ తో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..