Samsung Galaxy F04: శాంసంగ్ నుంచి అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. వివరాలివే..

మాంచి కొనాలని భావిస్తున్నారా? అయితే, అంత బడ్జెట్ పెట్టలేక చింతిస్తున్నారా? మరేంపర్వాలేదు. ఆ చింత వీడండి. శాంసంగ్ నుంచి అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్..

Samsung Galaxy F04: శాంసంగ్ నుంచి అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. వివరాలివే..
Samsung Phone
Follow us

|

Updated on: Jan 04, 2023 | 3:48 PM

మాంచి కొనాలని భావిస్తున్నారా? అయితే, అంత బడ్జెట్ పెట్టలేక చింతిస్తున్నారా? మరేంపర్వాలేదు. ఆ చింత వీడండి. శాంసంగ్ నుంచి అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. అలాగని ఫీచర్స్ ఏమీ తక్కువగా లేవండోయ్.. వావ్ అనిపించే ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. శాంసంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మీడియాటెక్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ సేల్ డేట్, హ్యాండ్‌సెట్ ఫీచర్స్, ధర వంటి వివరాలను విడుదల చేసింది శాంసంగ్. ఆ వివరాలన్ని ఇప్పుడు చూద్దాం..

భారతదేశంలో Samsung Galaxy F04 ధర..

శాంసంగ్ నుంచి వస్తున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర రూ. 7,499 నుంచి ప్రారంభమవుతుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ఇలా ఉంటుంది. అయితే, ఇది లాంచింగ్ ఆఫర్ ప్రైజ్ మాత్రమే. ఆఫర్ ముగిస్తే.. దీని ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఈ మొబైల్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్ Flipkart లో అందుబాటులో ఉండనుంది. జనవరి 12 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. కాగా, ఫోన్ రెండు కలర్స్‌లో వస్తోంది. ఒకటి ఓపల్ గ్రీన్, జెడ్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్..

ఈ ఫోన్‌లో 6.5-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది. 1600 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా వన్ UI 4.1పై ఫోన్ పనిచేస్తుంది. కాగా, ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ వెర్షన్‌లను పొందుతుంది. ఇక ఇందులోని సాఫ్ట్‌వేర్ కూడా అద్భుతంగా ఉంది. MediaTek Helio P35 చిప్‌సెట్‌తో, గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 GPU ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లు 4 GB RAM నుంచి 8GB RAM వరకు వేరియంట్స్‌లలో ఉంది. స్టోరేజ్ 64 జీబీతో పాటు.. ఎస్‌డి కార్డు సహాయంతో స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

కెమెరా సెటప్: ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడం జరిగింది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది. బ్యాటరీ కెపాసిటీ: Samsung F సిరీస్ కింద విడుదల చేసిన ఈ తాజా ఫోన్‌లో USB టైప్-C పోర్ట్ ద్వారా 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం జరిగింది. కనెక్టివిటీ: డ్యూయల్-సిమ్ 4G, బ్లూటూత్ వెర్షన్ 5, Wi-Fi, GPS సపోర్ట్‌తో ఉన్న ఈ శాంసంగ్ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అయితే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌కు ఇవ్వలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?