AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yandamuri Veerendranath: మరోసారి చంద్రబోస్‌కు కౌంటర్ ఇచ్చిన యండమూరి.. ఈసారి ఇలా

చిరంజీవి హీరోగా, రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్  ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలై సెన్సేషన్ గా మారింది. అయితే, ఈ సాంగ్ విషయంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.

Yandamuri Veerendranath: మరోసారి చంద్రబోస్‌కు కౌంటర్ ఇచ్చిన యండమూరి.. ఈసారి ఇలా
Yandamuri Veerendranath
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2023 | 3:09 PM

Share

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు మూవీ లిరిసిస్ట్ చంద్రబోస్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా, రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్  ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలై సెన్సేషన్ గా మారింది. అయితే, ఈ సాంగ్ విషయంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ పాట రాసిన లిరిక్ రైటర్ ఎవరంటూ యండమూరి చేసిన కామెంట్స్‌‌పై.. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ ఘాటుగా స్పందించారు. అర్థం తెలియకుండా మాట్లాడే వాళ్లకు.. చెప్పినా అర్థం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. పాటలో తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే.. తిమిరనేత్రమై ఆవతరించిన త్రినేత్రుడే.. ఈ పదాలు వాడుతూ.. అసలు ఈ పాట రాసిన వాడికి పురాణకథలు తెలుసా.. అతడేం చదివాడు.. తిమిరము అంటే అర్థం తెలుసా నీకు..? శివదూషణ కాదా ఇది.. ఏమిటీ పిచ్చి రాతలు.. తెలుగు సిని కవిత్వం వేటూరి మరణంతో మసకబారి దీపం అయింది.. సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది అంటూ యండమూరి పోస్ట్ చేశారు.

దీనికి కౌంటర్ గా చంద్రబోస్ స్పందిస్తూ..తాను ఏ ఉద్దేశ్యంతో ఈ పాటలోని పదాలు వాడాల్సి వచ్చిందో వివరించారు. తను శివదూషణ చేయలేదని, హీరో పాత్ర స్వభావాన్ని మాత్రమే అందులో ప్రతిబింబించేలా పదాలు రాశానని తెలిపారు. చిరంజీవి గారూ, సత్యానంద్ గారూ పాట విన్న తర్వాత.. ఇది అధ్యయనం చేయాల్సిన పాట అంటూ ప్రశంసించారని తెలిపారు. తాజాగా మరోసారి యండమూరి చంద్రబోస్ కు కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

2×2= 3 అన్న నీ అభిప్రాయం పట్ల నీకు ఎంత నమ్మకం ఉన్నదీ, 2×2 = 5 అని నీతో వాదించే వారికి కూడా తమ అభిప్రాయాల పట్ల అంతే నమ్మకం ఉంటుందని గ్రహించిన రోజు, నువ్వు వాదనలతో సమయం వృధా చేసుకోవు. మూర్ఖుడు వాదిస్తాడు. మేధావి చర్చిస్తాడు. జ్ఞాని నవ్వి ఊరుకుంటాడు. నీ గురించి ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారంటే, వారికి ఇంకో సబ్జెక్టు గురించి మాట్లాడే జ్ఞానం లేదన్నమాట. (ప్రస్తుతం రాస్తున్న పుస్తకం నుంచి). అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Follow Us
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్