Personal Loan: పర్సనల్ లోన్ తీసుకొనే ముందే వీటి గురించి అడగండి.. లేకపోతే పుట్టి మునుగుతారు!

పర్సనల్ లోన్లు తీసుకునే ముందు.. ఎటువంటి అవగాహన లేకుండా ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటారు. అది చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. రుణదాతలు సులభంగా ఇచ్చేస్తున్నారు కదా అని ఎటువంటి విచారణ లేకుండా రుణాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రుణం తీసుకునే ముందే వడ్డీ రేటు, లోన్ కాలపరిమితి, అదనపు ఫీజులు, ఛార్జీలు వంటి వాటి గురించి రుణదాత వద్ద ఆరా తీయాలని వివరిస్తున్నారు.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకొనే ముందే వీటి గురించి అడగండి.. లేకపోతే పుట్టి మునుగుతారు!
Personal Loan
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2023 | 9:56 PM

పర్సనల్ లోన్.. ఇటీవల కాలంలో జనాలు విరివిగా ఈ లోన్లు తీసుకుంటున్నాయి. పలు జాతీయ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్షియర్లు, స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు అన్నీ ఈ లోన్లు సులభంగా మంజూరు చేస్తున్నారు. వీటిని ఏ విధంగానైనా వినియోగించుకునే వెసులుబాటు ఉండటం, త్వరితగతిన ఎటువంటి ఆధారాలు, పత్రాలు, తనఖా వస్తువులు లేకుండా ఇస్తుండటంతో అందరూ వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే వీటిల్లో సంప్రదాయ రుణాలైన హోమ్ లోన్, గోల్డ్ లోన్ వంటి వాటితో పోల్చితే వడ్డీ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది ఈ లోన్లు తీసుకునే ముందు.. ఎటువంటి అవగాహన లేకుండా ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటారు. అది చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. రుణదాతలు సులభంగా ఇచ్చేస్తున్నారు కదా అని ఎటువంటి విచారణ లేకుండా రుణాలు తీసుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత రుణం తీసుకునే ముందే వడ్డీ రేటు, లోన్ కాలపరిమితి, అదనపు ఫీజులు, ఛార్జీలు వంటి వాటి గురించి రుణదాత వద్ద ఆరా తీయాలని వివరిస్తున్నారు. ఈ ప్రశ్నలు రుణదాతను అడగటం వల్ల మీకు సరసమైన వడ్డీ రేటుతో రుణం మంజూరు అవడానికి సాయపడుతుంది. అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశాలు కూడా తగ్గుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వడ్డీ రేటు విధానం?

పర్సనల్ లోన్ తీసుకునే ముందు, మీ లోన్‌పై వడ్డీ రేటు స్థిరంగా ఉందా లేదా ఫ్లోటింగ్ రేటు ఉందా? అనేది తెలుసుకోవాలి. అది మీ నెలవారీ చెల్లింపులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఒక రుణం తీసుకున్నప్పుడు రెండు రకాల వడ్డీ రేట్లు బ్యాంకర్లు విధిస్తారు. ఒకటి ఫిక్స్డ్(స్థిర), రెండు ఫ్లోటింగ్.

ఫిక్స్‌డ్ వడ్డీ రేటు అనేది లోన్ తీసుకునే సమయంలో నిర్ణయిస్తారు. లోన్ కాలవ్యవధి అంతా అదే వడ్డీ రేటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్ కాలవ్యవధి అంతా ఒకేలా ఉండదు. ఆర్బీఐ రెపో రేటును మార్చినప్పుడల్లా ఫ్లోటింగ్ వడ్డీ రేటు మారుతుంది. ఒకవేళ ఇది గణనీయంగా పెరిగితే, మీ మొత్తం తిరిగి చెల్లింపు మొత్తం కూడా పెరుగుతుంది. ఇది మీపై మరింత ఆర్థిక భారం పడేలా చేస్తుంది. అయితే రెపో రేటు తగ్గితే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ఇది ఫ్లోటింగ్ వడ్డ రేటుతో ఉన్న అతి పెద్ద ప్రయోజనం. అలాగే మార్కెట్ హెచ్చు తగ్గులకు ఫిక్స్ డ్ వడ్డీ రేటు ప్రభావితం కాదు.

రుణ కాలపరిమితి..

అందుబాటులో ఉన్న లోన్ కాలపరిమితి ఎంపికల గురించి మీ రుణదాతను అడగండి. లోన్ రీపేమెంట్ కోసం గరిష్ట, కనిష్ట కాలవ్యవధి ఎంత?అనేది కూడా తెలుసుకోవాలి.

వ్యక్తిగత రుణాలు కొన్ని నెలల నుంచి చాలా సంవత్సరాల వరకు వివిధ రుణ నిబంధనలతో వస్తాయి. ఎక్కువ కాల వ్యవధి పెట్టుకుంటే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. లోన్ ముందస్తు చెల్లింపు ద్వారా మొత్తం రీపేమెంట్ డబ్బును గణనీయంగా తగ్గించవచ్చు.

ఇతర చార్జీలు..

వడ్డీ రేటు కాకుండా, పర్సనల్ లోన్‌ తీసుకునేటప్పుడు ఇతర చార్జీలు పడతాయి. ఈ చార్జీల్లో ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు జరిమానాలు, ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. లోన్‌పై నిర్ణయం తీసుకునే ముందు ఈ అన్ని చార్జీల గురించి తప్పకుండా అడగండి. మీరు మీ లోన్‌ను ముందస్తుగా చెల్లించాలనుకున్నా.. లేదా ఏవైనా ప్రత్యేక కారణాల వల్ల మీ ఈఎంఐని కొన్ని నెలల పాటు కట్టకుండా ఉండాలన్నా ముందుగా మీ బ్యాంక్‌కు తెలియజేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పెనాల్టీలు పడకుండా కాపాడుకోవచ్చు.

సురక్షితంగా ఉందా లేదా?

రుణం సురక్షితమైనదా లేదా అసురక్షితమా అని నిర్ణయించండి.సెక్యూర్డ్ లోన్‌లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండవచ్చు. కానీ మీరు డిఫాల్ట్ అయితే మీ కొలేటరల్‌ను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అసురక్షిత రుణాలు సాధారణంగా అధిక వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి కానీ వాటికి తాకట్టు అవసరం లేదు. వాటి మధ్య నిర్ణయించుకోవడానికి, మీ రిస్క్ ఫ్యాక్టర్, రీపేమెంట్ కెపాసిటీని యాక్సెస్ చేయండి.

రుణ ముందస్తు చెల్లింపు..

అనేక బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కంపెనీలు నిర్ణీత వ్యవధి కంటే ముందే వ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించడానికి చార్జీలను విధిస్తాయి. మీరు అదనపు చెల్లింపులు చేయడానికి లేదా లోన్‌ను అకాలంగా తిరిగి చెల్లించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ముందస్తు చెల్లింపు పెనాల్టీ గురించి ఆరా తీయండి. లోన్ తీసుకునే ముందు ప్రీ-క్లోజర్ ప్రక్రియ, ఛార్జీల గురించి బ్యాంక్‌లో స్పష్టంగా అడిగి తెలుసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!