UPI Payments: యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

ప్రస్తుతం ఆధునిక సమాజంలో అందివస్తున్న సాంకేతికతతో సౌకర్యంతో పాటే ప్రమాదం కూడా వెన్నంటే ఉంటుంది. ఆన్ లైన్ లావాదేవీలు చేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. లేకుంటే సైబర్ నేరగాళ్లు చొరబడి నిలువు దోపిడీ చేసేస్తారు. అందుకే యూపీఐని వినియోగించే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కొన్ని భద్రతాపరమైన అంశాలను మీకు పరిచయం చేస్తున్నాం..

UPI Payments: యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
Upi Payments
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 10, 2024 | 1:10 PM

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) మన దేశంలో ఆర్థిక లావాదేవీల సరళని మొత్తం మార్చేసింది. వేగంగా, సౌకర్యవంతంగా, పూర్తి భద్రతతో డబ్బులు పంపించి, స్వీకరించే ఓ అద్భుత ఆవిష్కరణ ఈ యూపీఐ అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ రంగం డిజిటలీకరణకు ఇది బాగా దోహదపడిందని చెప్పొచ్చు. ఈ యూపీఐ ద్వారా ఫండ్ ట్రాన్స్ ఫర్స్, బిల్ పేమెంట్స్, ఆన్ లైన్ షాపింగ్ వంటివన్నీ ఎంచక్కా చేసేయొచ్చు. అయితే ప్రస్తుతం ఆధునిక సమాజంలో అందివస్తున్న సాంకేతికతతో సౌకర్యంతో పాటే ప్రమాదం కూడా వెన్నంటే ఉంటుంది. ఆన్ లైన్ లావాదేవీలు చేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. లేకుంటే సైబర్ నేరగాళ్లు చొరబడి నిలువు దోపిడీ చేసేస్తారు. అందుకే యూపీఐని వినియోగించే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కొన్ని భద్రతాపరమైన అంశాలను మీకు పరిచయం చేస్తున్నాం..

యూపీఐ పిన్..

మీరు యూపీఐ లావాదేవీ జరపడానికి అవసరమైనది ఈ పిన్. దీనిని భద్రంగా ఉంచుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. అలాగే సులభంగా అందరికీ తెలిసిపోయే పిన్ పెట్టకూడదు. కాస్ట కష్టంగా ఉంటేనే మంచిది. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా ఆ పిన్ చెప్పక పోవడం మంచిది. అలాగే ఈ పిన్ వీలైనంత తరచుగా మారుస్తూ ఉండాలి.

నగదు పంపే వ్యక్తి వివరాలు..

మీరు నగదు పంపాలకుంటున్న వ్యక్తి కాంటాక్ట్ వివరాలు సక్రమంగా ఉండాలి. మీరు ఫోన్ నంబర్ లేదా యూపీఐ ఐడీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ప్రధానం. ముందుగా యూపీఐ యాప్స్ లో వెరిఫై పేమెంట్ అడ్రెస్ ఫీచర్ ను తప్పనిసరిగా వినియోగించాలి. దీని వల్ల రిసిపెంట్ అథంటికేషన్, ఐడెంటిటీ ని ముందుగానే తెలుసుకునే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

నమ్మకమైన యూపీఐ యాప్స్..

యూపీఐ యాప్స్ పేరున్న వాటినే వినియోగించాలి. థర్డ్ పార్టీ యాప్స్ అస్సలు వినియోగించకూడదు. అలాగే యూపీఐ యాప్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. లేటెస్ట్ వెర్షన్ యాప్ ఉండాలి.

పబ్లిక్ వైఫై వాడొద్దు..

ఏ ఆన్ లైన్ లావాదేవీ అయినా ఎట్టి పరిస్థితుల్లోనే ఫ్రీ పబ్లిక్ వైఫై వినియోగించి చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ సైబర్ నేరాలు ఈ పబ్లిక్ వైఫై ల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే అవకాశం ఉన్నంత వరకూ ఆర్థిక లావాదేవీలు ఆన్ లైన్లో చేసేటప్పుడు మీ మొబైల్ డేటా వినియోగించడం మేలు. అలా కానీ పక్షంలో వైఫై వాడాల్సి వస్తే అది పూర్తి పాస్ వర్డ్ సెక్యూరిటీతో ఉన్నది అయ్యి ఉండాలి. ఫ్రీ పబ్లిక్ వైఫైని మాత్రం వాడొద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..