ITR Rules: ఆదాయపు పన్ను ఫారమ్‌లో కొత్త మార్పులు.. అవేంటో తెలుసా?
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు కొత్త సీజన్ ఈసారి ముందుగానే ప్రారంభమైంది. ఆదాయపు పన్ను శాఖ ITR-1, ITR-4 ఫారమ్స్ ను విడుదల చేసింది. సాధారణంగా, ఈ ఫారమ్‌లు ఆర్థిక సంవత్సరం చివరి నెలలలో అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల అవుతాయి. అయితే ఈసారి 2-3 నెలల ముందుగానే విడుదల చేశారు. పన్ను చెల్లింపుదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి, అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం జూలై 31 నాటికి ఐటీఆర్ ఫైలింగ్‌ను చేయాలి.
ఆదాయపన్ను చెల్లించేవారికి ఒక ముఖ్యమైన విషయం. 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫామ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సంవత్సరం ఫారమ్స్ లో మీరు తెలుసుకోవలసిన కొన్ని మార్పులు ఉన్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు కొత్త సీజన్ ఈసారి ముందుగానే ప్రారంభమైంది. ఆదాయపు పన్ను శాఖ ITR-1, ITR-4 ఫారమ్స్ ను విడుదల చేసింది. సాధారణంగా, ఈ ఫారమ్‌లు ఆర్థిక సంవత్సరం చివరి నెలలలో అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదల అవుతాయి. అయితే ఈసారి 2-3 నెలల ముందుగానే విడుదల చేశారు. పన్ను చెల్లింపుదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి, అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరం జూలై 31 నాటికి ఐటీఆర్ ఫైలింగ్‌ను చేయాలి.
- ముందుగా ITR-1 గురించి మాట్లాడుకుందాం. దీనినే సహజ ఫారమ్ అని కూడా అంటారు. వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయల వరకు ఉండే పన్ను చెల్లింపుదారుల కోసమే ఆ ఫారమ్. జీతం, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, వ్యవసాయ ఆదాయం 5,000 రూపాయల వరకు, ఇతర వనరుల నుండి ఆదాయాన్ని పొందేవారికి ఈ ఫారమ్ వర్తిస్తుంది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ విధానంగా మార్చారు. అంటే మీరు మినహాయింపులు, తగ్గింపులతో ఉండే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే, దానికి వీలుగా.. కొత్త పన్ను విధానాన్ని నిలిపివేయడానికి మీరు ‘అవును’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పన్ను విధానంలో ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు.
- ఫారమ్‌లోని పార్ట్ Cలో మినహాయింపుల కోసం కాలమ్ ఉంటుంది. సాయుధ దళాలలో పని చేస్తున్న యువతకు, ప్రత్యేకంగా అగ్నివీర్ కార్ప్స్ ఫండ్‌లో పని చేసే వారికి సెక్షన్ 80CCH కింద మినహాయింపుల కోసం సెపరేట్ సెక్షన్ ఉంది. అగ్నివీర్ కార్ప్స్ ఫండ్‌కు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
- ఫారమ్‌లో పార్ట్-E అనే విభాగం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన అన్ని బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అలాగే ఆ అకౌంట్ సేవింగ్స్ కు సంబంధించిందా లేక కరెంట్ అకౌంటా అన్నది కూడా చెప్పాలి.
- ఇప్పుడు ITR-4 ఫారమ్ గురించి మాట్లాడుకుందాం. దీనినే సుగమ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫారమ్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభక్త హిందూ కుటుంబాలు.. LLPలు ఫిల్ చేయవచ్చు. వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే మొత్తం ఆదాయం 50 లక్షల రూపాయల లోపు ఉన్నవారిని ఇందులో మినహాయించవచ్చు.
- ITR-4 ఫారమ్‌ను ఫైల్ చేసే పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి, కొత్త పన్ను విధానాన్ని నిలిపివేయడానికి ఫారమ్ 10-IEAని ఫిల్ చేయాలి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. మీరు పాత పన్ను విధానాన్ని కోరుకుంటే.. మీ ఐటిఆర్ ను గడువు తేదీ నాటికి దాఖలు చేయాలి. అంటే ఆ తేదీ జూలై 31. ఇక ఈ తేదీ లోపు మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే.. ఐటిఆర్ దాఖలు చేసేటప్పుడు మీరు కొత్త పన్ను విధానంతోనే వెళ్లే అవకాశం ఉంటుంది.
- ITR-4లో నగదు లావాదేవీలు 5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలనే షరతుతో, సెక్షన్ 44ADలో వ్యాపార టర్నోవర్ పరిమితిని రూ. 3 కోట్లకు పెంచారు. అదేవిధంగా, సెక్షన్ 44ADAలో, నగదు లావాదేవీలు 5 శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటే నిపుణులకు.. ఈ పరిమితిని 50 లక్షల నుండి 75 లక్షల రూపాయలకు పెంచారు. రెండింటిలోనూ, ‘నగదులో రసీదులు’ అనే కొత్త కాలమ్‌ను యాడ్ చేశారు. ఇక్కడ పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో ఎంత, ఎక్కడ నగదు అందుకున్నారో తెలపాలి. ఇంతకు ముందు, రెండు మోడ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈసారి నగదు మోడ్‌ను యాడ్ చేశారు. ఇప్పుడు, టర్నోవర్‌ను మూడు భాగాలుగా తెలపాలి.
- ITR ఫారమ్‌లను ముందుగా విడుదల చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులు కొత్త మార్పులను అర్థం చేసుకోవడానికి.. వాటికి సన్నద్ధం అవ్వడానికి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. దీనివల్ల వారు సకాలంలో రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. ఇక మీ లావాదేవీలన్నింటి సమాచారం.. అంటే మీ పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా మొదలైనవాటి ద్వారా.. ఆదాయపు పన్ను శాఖకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏదైనా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమాచార ప్రకటన- AIS లో మీ లావాదేవీలన్నింటి గురించీ చెక్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖకు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం చాలా అవసరం. లేకపోతే, మీరు నోటీసును అందుకోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..