Indian Railways: కదులుతున్న రైలు నుండి మొబైల్‌ లేదా పర్సు, బ్యాగ్‌ పడిపోయిందా? ఇలా చేస్తే మీ అడ్రస్‌కు పంపిస్తారు

ఏ కారణం చేతనైనా మీ మొబైల్ ఫోన్ లేదా పర్స్ రైలు నుండి పడిపోయినట్లయితే, ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో రాసి ఉన్న నంబర్‌ను నోట్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ స్నేహితుడి లేదా రైల్లో ఉన్న ఇతర ప్రయాణికుల ఫోన్‌ను తీసుకుని 139 నంబర్‌ లేదా 182 నంబర్‌కు కాల్‌ చేయాలి. ఈ కాల్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ డెస్క్‌ సిబ్బందికి వెళ్తుంది. సిబ్బందికి మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి సమాచారం..

Indian Railways: కదులుతున్న రైలు నుండి మొబైల్‌ లేదా పర్సు, బ్యాగ్‌ పడిపోయిందా? ఇలా చేస్తే మీ అడ్రస్‌కు పంపిస్తారు
Indian Railwlays
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2024 | 8:14 AM

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో భారతీయ రైల్వే తన ప్రయాణీకుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి నిరంతరం పని చేస్తుంది. రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్‌లను ఉపయోగించడం మనం తరచుగా చూశాము. కానీ చాలాసార్లు అజాగ్రత్త కారణంగా ప్రయాణిస్తున్నప్పుడు రైలు నుంచి మొబైల్, పర్సు, వాచ్ వంటి విలువైన వస్తువులు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే మార్గం గురించి తెలుసుకుందాం.

వెంటనే ఈ పని చేయండి

ఏ కారణం చేతనైనా మీ మొబైల్ ఫోన్ లేదా పర్స్ రైలు నుండి పడిపోయినట్లయితే, ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో రాసి ఉన్న నంబర్‌ను నోట్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ స్నేహితుడి లేదా రైల్లో ఉన్న ఇతర ప్రయాణికుల ఫోన్‌ను తీసుకుని 139 నంబర్‌ లేదా 182 నంబర్‌కు కాల్‌ చేయాలి. ఈ కాల్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ డెస్క్‌ సిబ్బందికి వెళ్తుంది. సిబ్బందికి మీరు పోగొట్టుకున్న వస్తువుల గురించి సమాచారం అందించాలి. అలాగే మీరు నోట్‌ చేసుకున్న పోల్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలి. అలాగే సిబ్బందికి మీ అడ్రస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీ వస్తువు పడిపోయిన ప్రాంతంలో పోల్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల పడిపోయిన వస్తువు కనుగొనడంలో సహాయపడుతుంది. పోల్ నంబర్ సహాయంతో, పోలీసులు మీరు పేర్కొన్న ప్రదేశానికి చేరుకుంటారు. మీ మొబైల్ ఫోన్, పర్సు లేదా వాచ్‌ని గుర్తిస్తారు. వస్తువులను కనుగొని వాటిని తిరిగి ఇస్తామని మాత్రం పోలీసులు హామీ ఇవ్వరు కానీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లే లోగా ఆ వస్తువు అలాగే ఉంటే తిరిగి ఇస్తారు.. కానీ ఎవరికైనా దొరికితే మాత్రం ఇవ్వరని గుర్తించుకోండి. ఒక వేళ రైల్వే సిబ్బంది అక్కడికి వెళ్లేవరకు ఎవరు తీసుకోకుంటే దానిని మీ అడ్రస్‌కు కొరియర్‌ చేస్తారు.

అలారం చైన్‌ని లాగడం సరైనదేనా లేదా తప్పా?

నిజానికి రైలులో చైన్ లాగడం నేరం. కానీ కొన్ని పరిస్థితులలో మీరు చైన్ పుల్లింగ్ చేయవచ్చు. మీతో ప్రయాణిస్తున్న పిల్లలు లేదా వృద్ధులు రైల్వే స్టేషన్‌లో వెనుకబడితే, మీరు చైన్ పుల్లింగ్ చేయవచ్చు. అదే సమయంలో ఒక వికలాంగుడిని స్టేషన్‌లో వదిలి రైలు ప్రారంభమైతే, అటువంటి పరిస్థితిలో కూడా చైన్ పుల్లింగ్ చేయవచ్చు. ఇవన్నీ కాకుండా, రైలులో అగ్నిప్రమాదం, దోపిడీ లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు చైన్ పుల్లింగ్ కూడా చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!