AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj EV Scooter: సింగిల్ చార్జ్‌తో 155 కిలోమీటర్ల రేంజ్.. అదరగొడుతున్నఎలక్ట్రిక్ స్కూటర్..!

ద్విచక్ర వాహన రంగంలో బజాజ్ చేతక్ స్కూటర్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో విడుదలైన ఈ స్కూటర్ ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ స్కూటర్ అంటూ భారతీయులందరూ అభిమానం చూపించేవారు. 90వ దశకంలో దాదాపు ప్రతి ఇంటా ఈ స్కూటరే కనిపించేది. ఆ తర్వాత కొన్ని రకాల బైక్ లు ద్విచక్ర వాహనాల మార్కెట్ ను ఏలాయి.

Bajaj EV Scooter: సింగిల్ చార్జ్‌తో 155 కిలోమీటర్ల రేంజ్.. అదరగొడుతున్నఎలక్ట్రిక్ స్కూటర్..!
Bajaj Chetak 3503
Nikhil
|

Updated on: May 01, 2025 | 4:00 PM

Share

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. వివిధ కంపెనీలు పలు ఇ-స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగానే బజాజ్ చేతక్ ఇ-స్కూటర్లు విడుదలయ్యాయి. వాటిలోని 3503 స్కూటర్ కేవలం రూ.1.10 లక్షలకు అందుబాటులో ఉంది. దాని ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం. బజాజ్ కంపెనీ 2024 డిసెంబర్ లో సరికొత్త చేతక్ 35 సిరీస్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. వీటిలో 3501, 3502, 3503 అనే మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి. వీటిలో టాప్ స్పెక్ 3501, మిడ్ స్పెక్ 3502, ఎంట్రీ లెవల్ 3503గా నిర్ణయించారు. వీటిలో మొదటి, రెండు వేరియట్ల ధరలను గతంలోనే ప్రకటించారు. మూడోదైన 3503 ధరను ఇటీవల వెల్లడించారు. దీని ధరను రూ.1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్దారించారు. అలాగే 3501 వేరియంట్ రూ.1.30 లక్షలకు, 3502 వేరియంట్ రూ.1.22 లక్షలకు అందుబాటులో ఉంది.

టాప్ స్పెక్ అయిన 3501 వేరియంట్ తో పోల్చితే 3503 స్కూటర్ ధర దాదాపు రూ.20 వేలు తక్కువ. కలర్ ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, హిల్ హూల్డ్ అసిస్ట్, బ్లూటూత్ ద్వాారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్ మెంట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్ లైట్ తో పాటు ఎకో, స్పోర్ట్స్ తదితర రైడ్ మోడ్ లతో అందుబాటులో ఉంది. అయితే మిగిలిన వాటితో పోల్చితే చాలా ఫీచర్లు దీనిలో ఉండవు. ముఖ్యంగా ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, టచ్ స్క్రీన్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చలేదు. కానీ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీతో కొత్త స్కూటర్ ను తీసుకువచ్చారు.

3501, 3502 వేరియంట్ల మాదిరిగానే 3503లో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. గంటకు గరిష్టంగా 63 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. సింగిల్ చార్జింగ్ పై సుమారు 155 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, మాట్ గ్రే తదితర నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. కొత్త చేతక్ 3503 వేరియంట్ బుక్కింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మే మొదటి వారం నుంచి డెలివరీలు చేస్తారు. కాగా.. మార్కెట్ లో ఇప్పటికే ఉన్న ఓలా ఎస్1ఎక్స్ ప్లస్, అథర్ రిజ్టా ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ తదితర 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ స్కూటర్లకు చేతక్ 3503 గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి