AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric scooter: కేవలం రూ.10 వేలు ఉంటే చాలు..ఈవీ స్కూటర్ మీ సొంతం

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఆ విభాగంలో తయారైన ద్విచక్ర వాహనాలు, కార్లకు ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, సహజ వనరుల కొరత తదితర కారణాలలో చాాలా మంది వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెట్రోలు ధరతో పోల్చితే చాలా తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రయాణం చేయవచ్చు. పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చు. కానీ పెట్రోలు వాహనాలతో పోల్చితే వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారందరికీ ఒక శుభవార్త, కేవలం రూ.పది వేల ఖర్చుతో మీ పాత పెట్రోలు స్కూటర్ ను ఎలక్ట్రిక్ టూ వీలర్ గా మార్చుకోవచ్చు.

Electric scooter: కేవలం రూ.10 వేలు ఉంటే చాలు..ఈవీ స్కూటర్ మీ సొంతం
Ev Scooter
Nikhil
|

Updated on: May 01, 2025 | 4:15 PM

Share

బెంగళూరులో మొదలైన ఈ ట్రెండ్ దేశ వ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. చాలామంది తమ పాత స్కూటర్లను రూ.పదివేల ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకుంటున్నారు. ఇండియన్ ఆయిల్, సన్ మెబిలిటీ కలిసి ఇండో ఫాస్ట్ ఎనర్జీ అనే సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ద్వారా ఏఆర్ఏఐ సర్టిపైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కిట్లను అందిస్తున్నారు. ఈ కిట్ ఖరీదు కేవలం రూ.పది వేలు మాత్రమే. వీటిని హోండా యాక్టివా, ఏవియేటర్, డియో, క్లిక్, సుజుకీ యాక్సెస్, స్విస్, టీవీఎస్ జూపీటర్, వీగో, యమమా ఫాసినో తదితర స్కూటర్లకు ఈజీగా అమర్చుకోవచ్చు. వాటిలోని పెట్రోల్ ఇంజిన్, ఇతర భాగాలను తొలగించి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కిట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర సుమారు రూ.లక్ష పైబడి ఉంది. వాటిని కొనడానికి అంత సొమ్ము పెట్టడంతో పాటు ఇప్పటికే వాడుతున్న పెట్రోలు వాహనాన్ని తక్కువ ధరకు విక్రయించాలి. ఇలా చేయడం వల్ల సామాన్యులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ సమస్యకు కేవలం రూ.పది వేలతో పరిష్కారం లభిస్తుంది. ఏఆర్ఏఐ కిట్ ను కొనుగోలు చేసి, పాత స్కూటర్ కు బిగించుకుంటే చాలు. పెట్రోలు ఖర్చు బాధ లేకుండా, విద్యుత్ ను ఉపయోగించి చక్కగా నడుపుకోవచ్చు.

కిట్ లోని స్వాపబుల్ బ్యాటరీని బెంగళూరులోని 900 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో మార్చుకోవచ్చు. వాహనం రిజిస్టేషన్ ను పెట్రోలు నుంచి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు. బీమా విషయంలో కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. యాక్టివాతో పాటు 11 రకాల పెట్రోలు స్కూటర్లకు కిట్లను చాలామంది మార్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేయడం కన్నా, రూ.పది వేలతో ఎలక్ట్రిక్ కిట్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం. తక్కువ ఖర్చుతోనే చాలా సులభంగా పని పూర్తవుతుంది. బెంగళూరులో మొదలైన ఈ ట్రెండ్ దేశంలో క్రమంగా విస్తరిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి