LPG Gas Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తాజా రేట్లు ఇవే..
సామాన్యులకు ఎంతో అవసరమైన గ్యాస్ ధరలు కాస్త తగ్గాయి.. వాణిజ్య వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి.. చమురు మార్కెటింగ్ కంపెనీలు 2025 మే 1 నుంచి అమలులోకి వచ్చేలా వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర గురువారం నుంచి తగ్గాయి.. అయితే.. ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

సామాన్యులకు ఎంతో అవసరమైన గ్యాస్ ధరలు కాస్త తగ్గాయి.. వాణిజ్య వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి.. చమురు మార్కెటింగ్ కంపెనీలు 2025 మే 1 నుంచి అమలులోకి వచ్చేలా వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర గురువారం నుంచి తగ్గాయి.. అయితే.. ప్రాంతాల వారీగా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర 15రూపాయల మేర ధర తగ్గింది.. నేటి నుండి రూ.1747.50.లుగా ఉంది.
హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ 19 కేజీల ధర.. రూ.1969 గా ఉంది.. రూ.16.5 ధర తగ్గింది. 47.5 కేజీల సిలిండర్ ధర రూ.4198.50 గా ఉంది.. రూ.41.5 ధర తగ్గింది.
గృహావసరాలకు వినియోగించే LPG గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో 14.2 కేజీలది రూ.905 గా ఉంది. ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. 5కేజీల సిలిండర్ ధర రూ.335.5 గా ఉంది. దీని ధరలో కూడా ఎలాంటి మార్పుల లేదు..
విజయవాడలో వాణిజ్య సిలిండర్ 19 కేజీల ధర.. రూ.1921 గా ఉంది.. రూ.44.5 ధర తగ్గింది. 47.5 కేజీల సిలిండర్ ధర రూ.4800 గా ఉంది.. రూ.110.5 ధర తగ్గింది.
గృహావసరాలకు వినియోగించే LPG గ్యాస్ సిలిండర్ ధర విజయవాడలో 14.2 కేజీలది రూ.877.5 గా ఉంది. 5కేజీల సిలిండర్ ధర రూ.326 గా ఉంది.
తగ్గిన ధరలు ఇవే..
19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు నుండి రూ.14.5 తగ్గింది. ఢిల్లీలో, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర నేటి నుండి రూ.1747.50. లుగా ఉంది. ముంబైలో రూ. 1699, కోల్‌కతా రూ.1851.50, చెన్నైలో రూ. 1906లుగా ఉంది.
అయితే, గృహ వినియోగ LPG సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు లేదు.. గత నెలలో, దేశీయ వంట గ్యాస్ లేదా LPG గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయి.. గృహ వినియోగ వంట గ్యాస్ పెరిగిన ధర 8 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వచ్చింది. ఉ
వివిధ నగరాల్లో LPG సిలిండర్ల ధరలను తనిఖీ చేయడానికి మీరు ఇండేన్ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా క్లిక్ చేయవచ్చు.
స్థానిక పన్నుల కారణంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.. దేశీయ సిలిండర్ ధరలలో చివరి సవరణ గత సంవత్సరం మార్చి 1న జరిగింది. వాణిజ్య, గృహ LPG సిలిండర్ల కోసం నెలవారీ సవరణలు సాధారణంగా ప్రతి నెల మొదటి రోజున జరుగుతాయి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




