ITR deadlines: ఇవే ఆఖరు తేదీలు.. పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాలి..

ఆదాయపు పన్ను రకాన్ని బట్టి ఐటీఆర్ ఫైలింగ్ చేసే గడువు తేదీలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇవి ప్రతి ఏటా ఒకే రకంగా ఉంటాయి. ఒక్కో సమయంలో ఈ తేదీలను ప్రభుత్వం పొడిగిస్తుంది. గడువు లోపు ఐటీఆర్ సమర్పించకపోతే పెనాల్టీ విధిస్తారు. సకాలంలో అందజేయడం వల్ల జరిమానా నుంచి తప్పించుకోవడంతో పాటు అనేక లాభాలు కలుగుతాయి.

ITR deadlines: ఇవే ఆఖరు తేదీలు.. పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాలి..
Income Tax
Follow us

|

Updated on: Jun 08, 2024 | 3:54 PM

దేశంలోని ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) సమర్పించడం చాలా ముఖ్యం. దేశ ప్రగతికి సంబంధించి వారి కనీస బాధ్యత కూడా. సకాలంలో ఐటీఆర్ సమర్పిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయపు పన్ను శాఖ సూచించిన గడువులోపులో దీనిని అందజేయాలి. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సిన గడువు తేదీలు గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు..

ఆదాయపు పన్ను రకాన్ని బట్టి ఐటీఆర్ ఫైలింగ్ చేసే గడువు తేదీలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇవి ప్రతి ఏటా ఒకే రకంగా ఉంటాయి. ఒక్కో సమయంలో ఈ తేదీలను ప్రభుత్వం పొడిగిస్తుంది. గడువు లోపు ఐటీఆర్ సమర్పించకపోతే పెనాల్టీ విధిస్తారు. సకాలంలో అందజేయడం వల్ల జరిమానా నుంచి తప్పించుకోవడంతో పాటు అనేక లాభాలు కలుగుతాయి. వివిధ పన్ను ప్రయోజనాలు, వాపసులను మీకు అందుతాయి. కాబట్టి క్యాలెండర్‌లో ఐటీఆర్ తేదీలను గుర్తించి, సకాలంలో అందజేయండి.

గడువు తేదీలు ఇవే..

  • వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్ యూఎఫ్ లు), వ్యక్తుల సంఘాలు (ఏఓపీలు), బాడీస్ ఆఫ్ ఇండివిజ్యువల్స్ (బీవోఐలు) తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది జూలై 31 వరకూ గడువు ఉంది.
  • సంస్థలు, వన్ పర్సన్ కంపెనీలు (వోపీసీలు), లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్‌లు (ఎల్ఎల్పీలు), ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అక్టోబర్ 31 లోపు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయాలి. అయితే సెప్టెంబర్ 30 లోపు ఆడిట్ నివేదికకు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.
  • బదిలీ ధర నివేదికలు అవసరమయ్యే వ్యాపారాలకు సంబంధించి తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్‌లను నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి.
  • సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి డిసెంబర్ 31 చివరితేదీ.
  • ఐటీఆర్ ను జూలై 31 లోపు చెల్లించకపోతే డిసెంబర్ 31 తేదీలోపు లేట్ ఐటీఆర్ ను అందజేయాలి.

దేశ ప్రగతికి దోహదం..

దేశ ప్రగతికి ఆదాయపు పన్నుచాలా దోహదపడుతుంది. ప్రభుత్వానికి ఇదే ప్రధాన ఆదాయ వనరు. దీని ద్వారా వచ్చిన సొమ్మును ఉద్యోగులు జీతాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, రక్షణ రంగం తదితర వాటికి వెచ్చిస్తారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ తప్పనిసరిగా ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. ఐటీఆర్ అనేది ఆ ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను చెల్లించే ఆదాయాన్ని తెలియజేస్తుంది. దీనిలో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, క్లెయిమ్ చేసిన తగ్గింపులు, మినహాయింపులు, చెల్లించిన పన్నులను తెలియజేస్తారు. దాదాపు తొమ్మిది రకాల ఐటీఆర్ ఫాంలు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్