AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual funds: సిప్ వర్సెస్ లంప్‌సమ్ ఏది బెటర్? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిందిదే..

సిప్ విధానంలో స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు ప్రతినెలా కొంత మొత్తం జమ చేయవచ్చు. దీని వల్ల స్టాక్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు, అలాగే ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తారు. దీనివల్ల కొనుగోలు ఖర్చును సగటున అంచనా వేయవచ్చు. సిప్ పెట్టుబడులు ఆర్థిక క్రమశిక్షణను కలిగిస్తాయి.

Mutual funds: సిప్ వర్సెస్ లంప్‌సమ్ ఏది బెటర్? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిందిదే..
Mutual Fund
Madhu
|

Updated on: May 27, 2024 | 11:57 AM

Share

ఇటీవల కాలంలో అందరి నోటా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మ్యూచువల్ ఫండ్స్. వాటిలో పెట్టుబడి ఎలా పెట్టాలి? ఆదాయం ఎంత వస్తుంది? రిస్క్ ఏమైనా ఉంటుందా అనే చర్చలు తరచూ జరుగుతున్నాయి. గతంలో బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్లు చేయడానికి ప్రజలు ఇష్టపడేవారు. ప్రస్తుతం వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారు బాగా పెరిగారు. రిస్క్ తో పాటు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్ కు డిమాండ్ పెరిగింది.

మ్యూచువల్ ఫండ్ అంటే..

మ్యూచువల్ ఫండ్ అనేది పెట్టుబడి మార్గం. షేర్ మార్కెట్ లో స్టాక్ లు, వివిధ బాండ్లు, ఇతర సెక్యూరిటీల పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారుల నుంచి డబ్బును వసూలు చేస్తుంది. వీటిని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు. లాభదాయకమైన మార్గాలకు డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. వీటిపై వచ్చే ఆదాయం మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ తదితర వాటిపై ఆధారపడి ఉంటుంది.

సిప్, లంప్ సమ్ మధ్య తేడాలేవే..

మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టే విధానాలనే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్), లంప్ సమ్ అంటారు. ఈ రెండింటికీ తేడాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, రిస్క్ లను తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్ ప్రయోజనాలు..

  • మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మన పెట్టుబడిని వివిధ ఆదాయ మార్గాలకు మళ్లిస్తారు. ఒకే స్టాక్ లోనో, షేర్ లోనో పెట్టరు. దీనివల్ల మనకు నష్టం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
  • పెట్టుబడి నిర్ణయాలను అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు తీసుకుంటారు. ఆయా మార్గాలలో వచ్చే రాబడిపై వారికి అంచనా ఉంటుంది.
  • మ్యూచువల్ ఫండ్స్ లో షేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం సులభం. ఇది పెట్టుబడిదారులకు సౌలభ్యాన్ని కలిగిస్తుంది. వివిధ రిస్క్ లెవెల్స్‌తో వేర్వేరు పెట్టుబడి ఎంపికలను అందిస్తాయి.
  • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయని గమనించాలి.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)..

సిప్ విధానంలో స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు ప్రతినెలా కొంత మొత్తం జమ చేయవచ్చు. దీని వల్ల స్టాక్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు, అలాగే ధర ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తారు. దీనివల్ల కొనుగోలు ఖర్చును సగటున అంచనా వేయవచ్చు. సిప్ పెట్టుబడులు ఆర్థిక క్రమశిక్షణను కలిగిస్తాయి. పొదుపు, పెట్టుబడి అలవాట్లను పెంచుతాయి. ప్రతినెలా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ రిస్క్ ల నుంచి బయటపడవచ్చు. సిప్ విధానంలో పెట్టుబడి తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్యులు కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.

నష్టాలు.. స్థిరంగా పెరుగుతున్న మార్కెట్‌లో ఏక మొత్తం లో పెట్టుబడులు మొదటి నుంచీ లాభాలు అందిస్తాయి. సిప్ విధానంలో ఆ అవకాశం లేదు. సిప్ విధానంలో ప్రతినెలా పెట్టుబడి పెట్టాలి. ఇది కొందరు పెట్టుబడి దారులకు ఇబ్బంది కలిగించవచ్చు. వారికి ప్రతినెలా కొంత మొత్తం ఇలా కేటాయించడం కుదరకపోవచ్చు.

లంప్ సమ్ (ఏకమొత్తం పెట్టుబడి)..

ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే దానికి అనుగుణంగా రాబడిని ఇచ్చే మార్గాలను ఎంచుకోవచ్చు. లాభదాయకమైన వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అవి భవిష్యత్తులో మంచి ఆదాయం ఇవ్వవచ్చు. లంప్ సమ్ విధానాన్ని వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. తక్కువ సమయంలో పని పూర్తవుతుంది. ప్రతినెలా ఆలోచించే అవసరం ఉండదు.

నష్టాలు.. ఏకమొత్తం లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్‌కు ఎక్కువ అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టిన కొద్దిసేపటికే మార్కెట్ క్షీణిస్తే, మొత్తం ప్రమాదంలో పడుతుంది. ఈ విధానంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. అందువల్ల న్వెస్ట్ చేయడం అందరికీ సాధ్యం కాదు.

గమనించాల్సిన అంశాలు..

  • మార్కెట్లు నిలకడగా పెరుగుతాయని భావిస్తే లంప్ సమ్ విధానం, మార్కెట్లు అస్థిరంగా లేదా క్షీణించవచ్చని అంచనా వేసినట్లయితే సిప్ విధానాలు బాగుంటాయి.
  • దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ రెండు విధానాలూ ఉపయోగపడతాయి.
  • సిప్ లు మీ పొదుపును, పెట్టుబడి విధానాలను ప్రోత్సహిస్తాయి. లంప్ సమ్ లు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
  • మీ ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలకు ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..