AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Saving Investments: పన్ను ఆదా చేసే బెస్ట్ స్కీమ్స్ ఇవే.. వెంటనే ఖాతా ఓపెన్ చేయండి..

పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు తమ కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి పెట్టుబడి రుజువును సమర్పించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఆదా చేయడానికి ఇదే చివరి అవకాశం. లేకుంటే వారి జీతం నుండి పన్ను కట్ అవడం ప్రారంభమవుతుంది. అందుకే ఏదో ఒక పన్ను ఆదా చేసే పథకంలో పెట్టుబడి పట్టేందుకు అందరూ వెతుకుతున్నారు.

Tax Saving Investments: పన్ను ఆదా చేసే బెస్ట్ స్కీమ్స్ ఇవే.. వెంటనే ఖాతా ఓపెన్ చేయండి..
Income Tax
Madhu
| Edited By: |

Updated on: Jan 16, 2024 | 11:45 AM

Share

పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించే పన్నులను ఆదా చేసుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందుకోసం వివిధ పెట్టుబడి పథకాలు సైతం ఉపయోగపడుతుండటంతో వాటి వైపు చూస్తున్నారు. పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు తమ కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి పెట్టుబడి రుజువును సమర్పించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఆదా చేయడానికి ఇదే చివరి అవకాశం. లేకుంటే వారి జీతం నుండి పన్ను కట్ అవడం ప్రారంభమవుతుంది. అందుకే ఏదో ఒక పన్ను ఆదా చేసే పథకంలో పెట్టుబడి పట్టేందుకు అందరూ వెతుకుతున్నారు.

ఇవి గుర్తుంచుకోండి..

అయితే, ప్రస్తుత సంవత్సరం 2024లో పన్నులను ఆదా చేయడానికి ఎంత? ఎక్కడ? పెట్టుబడి పెట్టాలనే దానిపై మీరు నిర్ణయించుకునే ముందు, పాత, కొత్త పన్ను విధానాల గురించి తెలుసుకోవడం మంచిది. కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంచుకుంటే దీనిలో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకటే కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద డిడక్షన్స్ లేవు. ఒకవేళ మీరు పాత పెన్షన్ విధానంలోకి వెళ్తే అప్పుడు మీరు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కేవలం పన్నులను ఆదా చేసే ఉద్దేశంతో జీవిత బీమా ఉత్పత్తుల్లో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి. ఇది మీ ఫ్యామిలీకి కూడా అండగా ఉంటుంది కాబట్టి దానిని ఎంచుకోవాలి.

పన్ను ఆదా చేసే పెట్టుబడి పథకాలు..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మీరు యౌవనస్థులైతే మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటే, ఈఎల్ఎస్ఎస్ (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఉత్తమం. ఇది అధిక రాబడిని అందిస్తుంది. ఈఎల్ఎస్ఎష్ లాక్-ఇన్ వ్యవధి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ, మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కాబట్టి, ఈ ఉత్పత్తిని ఎన్నుకునేటప్పుడు భవిష్యత్తులో నిధుల అవసరాన్ని కూడా అంచనా వేయాలి.

ఇవి కూడా చదవండి

ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) వంటి పెట్టుబడి మొత్తం కాలానికి స్థిర వడ్డీ రేటును అందించే ఏదైనా స్కీమ్ లకు వెళ్లొచ్చు.

అధిక పన్ను స్లాబ్‌ల పరిధిలోకి వచ్చేవారు, ఎక్కువ కాలం తమ డబ్బును లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నవారు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు, ఇక్కడ సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. మీరు జీతం పొందుతున్నట్లయితే, మీ ప్రావిడెంట్ ఫండ్‌కి ఎక్కువ విరాళాలు ఇవ్వాలని మీరు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎటువంటి రిస్క్ లేకుండా అత్యధిక రాబడిని అందిస్తుంది

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, దీర్ఘకాలిక ఎఫ్డీల వంటి పన్ను ఆదా చేసే పెట్టుబడులు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద వీటిల్లో ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేస్తుంది. తగ్గింపులను అనుమతిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఈక్విటీ పెట్టుబడులు, సాధారణంగా, దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను పోగుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఎన్పీఎస్ పన్ను ప్రయోజనాలను అందించడమే కాకుండా దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళికకు సాధనంగా కూడా పనిచేస్తుంది. ఎన్‌పిఎస్‌లో ఈక్విటీ, డెట్ ఫండ్‌లను బ్యాలెన్సింగ్ చేయడం వల్ల పన్ను ఆదా లక్ష్యాలతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు కూడా సంపాదించొచ్చు.

వ్యక్తిగత, కుటుంబం లేదా తల్లిదండ్రుల కోసం చెల్లించిన ఆరోగ్య బీమా ప్రీమియం సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపులకు అర్హత పొందుతుంది. అలాగే, జీవిత బీమా ఆర్థికంగా సురక్షితంగా ఉండటమే కాకుండా సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా ప్రయోజనాలను కూడా అందిస్తుంది. హౌసింగ్ లోన్‌లపై వడ్డీ చెల్లింపులు సెక్షన్ 24, సెక్షన్ 80సీ కింద తగ్గింపులకు అర్హత పొందుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..