Interview Tips: ఇంటర్వ్యూ టిప్స్.. గూగుల్ ఎక్స్‌పర్ట్ నుంచి.. మిస్ కాకండి..
ఓ ఎక్స్ పర్ట్‌తో మీకు టిప్స్ అందిస్తున్నాం. ఆయన ఎవరో తెలుసా? ప్రపంచ టెక్ దిగ్గజం అయిన గూగుల్ సంస్థలో ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డానియల్ రిజియా. ఈయన దాదాపు కంపెనీ తరఫున 1000పైగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ నియామక కమిటీలు, బోర్డుల్లో మెంబర్‌గా వ్యవహరించారు. ఆయన అనుభవంలో ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు తరచూ చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని చెబుతున్నారు.

డిగ్రీలో మంచి మార్కులుంటాయి. సబ్జెక్టులో మంచి పట్టు ఉంటుంది. కానీ ఇంటర్వూల్లో ఫెయిల్ అవుతుంటారు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి అనుభవం ఉన్న వారు కూడా ఇలాగే చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు క్రాక్ చేయడంలో ఇబ్బంది పడతారు. మీకు అలాంటి ఫోబియానే ఉంటే.. ఈ కథనం మీ కోసమే. దీనిలో ఓ ఎక్స్ పర్ట్‌తో మీకు ఇంటర్వ్యూ టిప్స్ అందిస్తున్నాం. ఆయన ఎవరో తెలుసా? ప్రపంచ టెక్ దిగ్గజం అయిన గూగుల్ సంస్థలో ఇంజినీరింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డానియల్ రిజియా. ఈయన దాదాపు కంపెనీ తరఫున 1000పైగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. వివిధ నియామక కమిటీలు, బోర్డుల్లో మెంబర్‌గా వ్యవహరించారు. ప్రోడక్ట్ మేనేజర్ల దగ్గర నుంచి ఇంజినీర్లు, మేనేజర్లు, యూఎక్స్ డిజైనర్ల వరకూ విభిన్న నేపథ్యాలు, సీనియారిటీ కలిగి వ్యక్తులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయన అనుభవంలో ఇంటర్వ్యూలకు వచ్చే అభ్యర్థులు తరచూ చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ తప్పులు ఏంటి? దానిని అధిగమించాలంటే ఏం చేయాలి? డానియల్ చెబుతున్న టిప్స్ మీకోసం..
పని వచ్చు కాబట్టి జాబ్ వచ్చేస్తుంది..
సాధారణంగా అందరిలో ఉండే భ్రమ ఇది. ప్రతి ఒక్కరూ టెక్నికల్‌గా బాగా నాలెడ్జ్ ఉంది. ఉద్యోగం గ్యారంటీ అనే ఆలోచనల్లో ఉంటారు. అయితే వాస్తవం కాదని డానియల్ చెబుతున్నారు. మీకు పని ఎంత బాగా వచ్చినా.. అది ఇంటర్వ్యూలో మిమ్మల్ని విజయవంతం చేయదని సూచిస్తున్నారు. మీరు అనుభవం కలిగిన వ్యక్తి అయినా ఇంటర్వ్యూని క్రాక్ చేయడంలో సన్నద్ధత అవసరమని వివరిస్తున్నారు. ఉదాహరణ మీరు సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్లారనుకుంటే.. అక్కడి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు ఓ కోడ్ రాయాలని టాస్క్ ఇచ్చారు. అది మీరు సిస్టమ్ అయితే చకచకా చేసేస్తారు. అయితే ఇంటర్వ్యూలో పేపర్ మీద కోడ్ రాయాలంటే అంత సులభమైన పని కాదు. అందుకే వాస్తవ పని వాతావరణానికి, ఇంటర్వ్యూకి ఉన్న తేడాను గుర్తించి, అందుకు తగిన విధంగా ప్రిపేర్ అవ్వాలని డానియేల్ సూచించారు. అందుకోసం అభ్యర్థులు ఇంటర్వ్యూ ప్రశ్నలకు సొంతంగా పేపర్ పై ప్రాక్టీస్ చేయాలి. మాక్ ఇంటర్వ్యూలకు అటెండ్‌కావాలి.
అలసిపోయి ఇంటర్వ్యూకి వెల్లడం..
చాలామంది అభ్యర్థులు తమ పనితీరును ఎక్కువగా అంచనా వేస్తారు. అయితే వారికి సహాయపడే చిన్న విషయాలను విస్మరిస్తారు. అందులో విశ్రాంతి రెస్ట్ ఒకటి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ శరీరానికి, మనసునకు తగిన విశ్రాంతి అవసరం. లేకపోతే ఇంటర్వ్యూ సమయంలో మీ ఐక్యూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా రోజుల పని తర్వాత లేదా చాలా మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడం తాను చూశానని డానియేల్ చెబుతున్నారు. ఇంటర్వ్యూలో విజయవంతం కాకపోవడానికి వారికి జ్ఞానం లోపించింది కాదు, కానీ వారు అలసిపోయారని తనకు స్పష్టంగా అర్థమవుతుందని వివరించారు. వారు అలసిపోయిన కారణంగా తమ ప్రశ్నలకు నెమ్మదిగా స్పందిస్తారని. వేసిన ప్రశ్నలు అర్థం చేసుకోలేరని వివరించారు. అసంబద్ధమైన విషయాలను చర్చిస్తారని చెప్పారు. అందుకే ఇంటర్వ్యూలకు వచ్చే ముందు తగిన విశ్రాంతి అవసరమని డానియేల్ వివరించారు.
సూచనలను అందుకోవడం ముఖ్యం..
ఇంటర్వ్యూల సమయంలో మీకు సమాధానాలు తెలియని సందర్భంలో చాలా మంది ఇంటర్వ్యూయర్‌లు మీకు సూచనలు ఇస్తారు. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే అదనపు సమాచారాన్ని వారి ప్రశ్నలకు జోడిస్తారు. వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సందేహాస్పదంగా ఉన్నప్పుడు లేదా మీరు చేస్తున్నదానికి విరుద్ధంగా కొన్ని సూచనలు వచ్చినప్పుడు, మీ ఇంటర్వ్యూయర్‌ని వారు ఏమి ఆశిస్తున్నారో అడగడంలో తప్పు లేదు.
సాఫ్ట్ స్కిల్స్ పై దృష్టి పెట్టకపోవడం..
చాలా మంది అభ్యర్థులు ప్రవర్తనా లేదా సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూల గురించి భయపడుతుంటారు. వాస్తవానికి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అయితే ట్రైనింగ్ సమయంలోనైనా నేర్చుకోవచ్చు. పర్సనల్ స్కిల్స్ అలా కాదు. వీటి ద్వారా ఇంటర్వ్యూయర్లు తమ కంపెనీలు అభ్యర్థి ఫిట్ అవుతాడా లేదా? ఇక్కడి వాతావరణంలో ఇమిడిపోగలడా లేదా అనేది అంచనా వేస్తారు. సాధారణ ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలు ఇలా ఉంటాయి.. ఏం జరిగింది? మీరు ఏమి చేస్తారు? ఫలితం ఏమిటి? అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








