AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pure storage: భారత్ వైపు ప్రపంచం చూపు.. వ్యాపారానికి అనేక అవకాశాలు.. ప్యూర్ స్టోరేజీ కంపెనీ సీఈవో వెల్లడి

మన దేశంలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతుంది. అత్యధిక జనాభా, సహజ వనరులు, కష్టపడే మనస్తత్వం కలిగిన ప్రజలు, సుస్థిర రాజకీయ వ్యవస్థ తదితర కారణాలు దీని వెనుక ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో ప్యూర్ స్టోరేజీ అనే డేటా కంపెనీ కూడా ఒకటి. డేటా సోల్యూషన్స్, ప్లాట్ ఫాంల కంపెనీ అయిన ఈ సంస్థ 2020లో మన దేశంలో తన సేవలను ప్రారంభించింది. ఇటీవల ఈ సంస్థ సీఈవో చార్లెస్ జియాన్ కార్లో ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. భారత దేశంలో మార్కెట్ అత్యంగా వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు.

Pure storage: భారత్ వైపు ప్రపంచం చూపు.. వ్యాపారానికి అనేక అవకాశాలు.. ప్యూర్ స్టోరేజీ కంపెనీ సీఈవో వెల్లడి
Charles Giancarlo
Nikhil
|

Updated on: Dec 21, 2024 | 2:09 PM

Share

ఆధునిక కాలంలో కంప్యూటర్ వినియోగించని కంపెనీ లేదు. కొన్ని అయితే కంప్యూటర్ల మీద ఆధారపడే పనిచేస్తాయి. అలాంటి వాటికి ఐటీకి సంబంధించిన సేవలు అందించే వాటిని డేటా స్టోరేజీ కంపెనీలు అంటారు. వాటిలో ప్యూర్ స్టోరేజీ కంపెనీ ఒకటి. ఇది ఆల్ ఫ్లాష్ ఎంటర్ ప్రైజ్ స్టోరేజీ ప్రొవైడర్. ఈ కంపెనీ స్టాక్ ధరలు ఈ ఏడాది దాదాపు 80 నుంచి 90 శాతం వరకూ పెరిగాయి. అంచనాలకు మించి రాబడి వచ్చింది. మన దేశంలో ఈ కంపెనీ పనితీరు, సేవల విస్తరణ, ఈ పరిశ్రమపై ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ప్రభాతం తదితర విషయాలను చార్టెస్ వెల్లడించారు.

డేటా పరిశ్రమలో ప్యూర్ స్టోరేజీ కంపెనీ ముందు వరుసలో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫ్లాష్ స్టోరేజీ కోసం ఎస్ఎస్ డీ (సాలిడ్ వేస్ట్ డ్రైవ్)లను ఉపయోగించని కంపెనీ ఇదే. వీరు డైరెక్ట్ ఫ్లాష్ లను వినియోగిస్తారు. ఐటీ పరిశ్రమ గత రెండేళ్లుగా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. కోవిడ్ సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. అలాగే ఈ పరిశ్రమలో ధరల పెరుగదల చాలా ఎక్కువగా ఉంది. అది ఇతర ఖర్చులపై ప్రభావం చూపింది. ప్రస్తుతం కొత్త సంవత్సరంలోని అడుగు పెడుతున్న తరుణంలో ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు. భారతదేశంలో ప్యూర్ స్టోరేజీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. గతేడాది రెట్టింపు అయ్యాయి. వచ్చే ఏడాది కూడా మార్కెట్ లో మరింత దూసుకపోవాలని ఈ కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. ఇక్కడ చదువుకున్నవారు ఎక్కువగా ఉన్నారు.

అలాగే శక్తివంతమైన, హైటెక్ కమ్యూనిటీ వ్యవస్థలో జీవిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలోకి అన్ని కొత్త టెక్నిక్ లను తీసుకురావచ్చు. మన దేశంలో ఈ స్టోరేజీ కంపెనీకి రెండు టాప్ టెల్కోలు ఉన్నాయి. అనేక వివిధ బ్యాంకులకు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు తయారీ, రవాణా సంస్థలు కూడా ఈ కంపెనీ ఖాతదారులే. ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలోని వెస్ట్ కోస్ట్, మన దేశంలోని బెంగళూరు, చెకోస్లోవేకియాలోని ప్రాగ్ నగరాల్లో ఈ సంస్థ అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి